ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీకి సంబంధించిన “రిలయన్స్ ఫౌండేషన్” ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు శుభవార్తను అందించింది. 2024 25 విద్యా సంవత్సరానికి తన స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను బుధవారం ప్రారంభించినట్లు ప్రకటించింది.
ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీకి సంబంధించిన “రిలయన్స్ ఫౌండేషన్” ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు శుభవార్తను అందించింది. 2024 25 విద్యా సంవత్సరానికి తన స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను బుధవారం ప్రారంభించినట్లు ప్రకటించింది.
డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్న విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారతదేశం అంతటా 5,100 అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందజేయనున్నట్లు తెలిపారు.
రిలయన్స్ ఫౌండేషన్ అనేది స్కాలర్‌షిప్‌లు శ్రేష్ఠతను పెంపొందించడానికి, భారతదేశ వృద్ధి కథనానికి నాయకత్వం వహించడానికి యువతను శక్తివంతం చేయడానికి రూపొందించబడ్డాయి. స్కాలర్‌షిప్‌లు విద్యార్థులు వారి విద్యా , వృత్తిపరమైన ఆకాంక్షలను సాధించడంలో సహాయపడతాయి.
భారతీయ సంస్థల నుండి రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అభ్యసిస్తున్న విద్యార్థులకు.. పీజీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ఈ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు మెరిట్ కమ్ మీన్స్ ప్రమాణాల ఆధారంగా 5,000 మెరిటోరియస్ విద్యార్థులకు ఇవ్వబడతాయి.
ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదవబోతున్న 5 వేల మంది విద్యార్థులకు రూ.2లక్షల వరకు స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు. తద్వారా వారు ఆర్థిక భారం లేకుండా తమ చదువులను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. డిగ్రీ పూర్తి చేసి పీజీ చదవబోతున్న 100 మంది విద్యార్థులకు రూ.6లక్షల వరకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
విద్యార్థుల ప్రతిభ, అభ్యర్థులకు ఆప్టిట్యూడ్ టెస్ట్‌ల ద్వారా స్కాలర్ షిప్ అందించనున్నారు. వచ్చే పదేళ్లలో 50వేల స్కాలర్‌షిప్‌లు అందిచాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ తెలిపారు. డిసెంబర్ 2022లో, రిలయన్స్ వ్యవస్థాపకుడు ఛైర్మన్ ధీరూభాయ్ అంబానీ 90వ జన్మదినోత్సవం సందర్భంగా, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు & చైర్‌పర్సన్ నీతా అంబానీ రాబోయే 10 సంవత్సరాలలో 50,000 స్కాలర్‌షిప్‌లను అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.
అప్పటి నుంచి ఏటా 5,100 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు, రిలయన్స్ 23,000 ఉన్నత విద్యా స్కాలర్‌షిప్‌లను అందించింది. స్కాలర్‌షిప్ కోసం https://www.scholarships.reliancefoundation.org/ ఈ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ స్కాలర్‌షిప్ ల కోసం ఇంటర్లో కనీసం 60శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. 2024 25 విద్యా సంవత్సరంలో మూడేళ్ల డిగ్రీ కోర్సులో చేరి ఉండాలి. విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.15లక్షల లోపు ఉండాలి. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మంచి మార్కులు సాధించాలి.
పీజీ స్కాలర్‌షిప్‌నకు.. గేట్ ప్రవేశ పరీక్షలో 550 1000 మధ్య స్కోర్ సంపాదించి ఉండాలి. గేట్ పరీక్ష రాయని వారు డిగ్రీలో 7.5కన్నా ఎక్కువ సీజీపీఏ సాధించి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మాథ్యమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, మెకానికల్, లైఫ్ సైన్సెస్ చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మంచి మార్కులు సాధించాలి.
No comments:
Post a Comment