గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయింది. బడ్జెట్ లో విద్యకు చాలా తక్కువ నిధులను కేటాయించేవారు. గత పదేళ్లలో డీఎస్సీ పత్తా లేకుండా పోయింది.
గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయింది. బడ్జెట్ లో విద్యకు చాలా తక్కువ నిధులను కేటాయించేవారు. గత పదేళ్లలో డీఎస్సీ పత్తా లేకుండా పోయింది. దీంతో పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా కనిపించింది.
అంతే కాకుండా.. పాఠశాలలో వసతులు ఉండేవి కావు. ఏ పాఠశాలకు వెళ్లి చేసినా పరిశుభ్రత కొరవడేది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా బడిబాట, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాలను కొనసాగించినా.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏ మాత్రం మారలేదు.
చిన్న వర్షం వచ్చినా.. పాఠశాల ఆవరణ అంతా వర్షపు నీరు చేరి.. కూర్చొవడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమస్యలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.
దీనిలో భాగంగానే విద్యకు బడ్జెట్ లో భారీగా నిధులను కేటాయించింది. ఇలా ప్రభుత్వ స్కూళ్లలో పరిశుభ్రత లేక ఇబ్బందులకు గురి అవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాలల్లో పరిశుభ్రత కోసం నిధులు విడుదల చేసింది.
ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం గ్రాంట్స్ మంజూరు చేసింది. పాఠశాలల నిధులకు అదనంగా ఈ గ్రాంట్‌ను కేటాయించినట్లు తెలిపింది.
తెలంగాణలోని పాఠశాలల్లో పరిశుభ్రత కొరవడిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లకు రూ.3 వేలు, 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉంటే.. రూ.6 వేలు, 101 నుంచి 250 మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లకు రూ.8 వేల చొప్పున ఇవ్వనున్నారు.
251 నుంచి 500 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.12 వేలు, 501 నుంచి 750 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.15 వేలు కాగా.. 750 కంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలకు రూ.20 వేలు చొప్పున 10 నెలల నిధులు ఒకేసారి విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’కి స్కూళ్ల పరిశుభ్రత బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
No comments:
Post a Comment