Mother Tongue

Read it Mother Tongue

Friday, 2 August 2024

తెలంగాణలో ఉద్యోగాల జాతర.. జాబ్ క్యాలెండర్‌పై కీలక అప్‌డేట్

 ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తాజాగా జాబ్ క్యాలెండర్‌పై కీలక అప్‌డేట్ బయటకొచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్.. ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే మెగా DSC నోటిఫికేషన్ వదిలి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. నిరుద్యోగులు పండగ చేసుకునే అప్‌డేట్ ఇవ్వడానికి రెడీ అయింది.

ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా స్పష్టమైన జాబ్ క్యాలండర్‌ను ప్రకటించబోతున్నామని ఇప్పటికే స్పష్టం చేసిన సీఎం.. దీనిపై ఫైనల్ స్టేట్‌మెంట్ ఇవ్వబోతున్నారట.

ప్రతి ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం (ఆగస్టు 2) అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యపై కీలక నిర్ణయాన్ని వెల్లడించనున్నారట సీఎం. నిరుద్యోగులను సంతోషపెట్టేలా జాబ్ క్యాలెండర్ ని ప్రకటించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అదేవిధంగా నైపుణ్యాల పెంపుపై పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామని ‘యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ’ స్థాపనకు ప్రతిపాదిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు.

జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అదేవిధంగా నైపుణ్యాల పెంపుపై పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామని ‘యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ’ స్థాపనకు ప్రతిపాదిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు.

నేడే జాబ్ క్యాలెండర్ రానుందనే విషయం తెలిసి నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్యోగార్థులంతా తిరిగి కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు.

ఇకపోతే ఇప్పటికే డీఎస్సీ వేసి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. మరోసారి జనవరి నెలలో డీఎస్సీ వేయడానికి సిద్ధమవుతోంది. మొత్తం 6 వేల పోస్టులతో రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్ ఉండనుందట. ఇప్పటికే దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని చెబుతున్న సీఎం.. ఇకపై ఇలా జరగకుండా TSPSC ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరిగి తీరుతుందని ఎప్పటికప్పుడు హామీ ఇస్తున్నారు.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials