మన భారతీయ రైల్వే చాలా పెద్దది. అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇది. అందువల్ల ఇందులో ఉద్యోగం రావడం చాలా గొప్ప విషయం. మరి ఆ ఖాళీల సంగతులు తెలుసుకుందాం.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB), భారతీయ రైల్వేలో 7,951 ఉద్యోగాల భర్తీ కోసం జులై 30న దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. సివిల్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేసిన వారు, ఇంకా చదువుతున్న వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి టైమ్ ఉంది. ఇందులో జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు 7,934, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు 17 ఉన్నాయి.
ఈ పోస్టులలో జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అసిస్టెంట్, మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్‌వైజర్ (రీసెర్చ్), మెటలర్జికల్ అసిస్టెంట్ (రీసెర్చ్) వంటివి ఉన్నాయి. వీటికి అర్హత వయస్సు 18-36 ఏళ్లు. CBT-1, CBT-2, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రారంభ వేతనం జేఈకి రూ.35,400, కెమికల్ సూపర్ వైజర్‌కి రూ.44,900 ఉంటుంది.
అప్లై చేసుకోవాలి అనుకునేవారు.. RRB వెబ్‌సైట్ (https://rrbsecunderabad.gov.in/wp-content/uploads/2024/07/CEN-03-2024_JE_English.pdf) ద్వారా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500, SC, ST, ఆర్థికంగా వెనకబడిన వర్గాలవారు, మహిళా అభ్యర్థులకు రూ.250. అలాగే అప్లికేషన్‌లో ఏవైనా పొరపాట్లను సరిదిద్దాలంటే అదనంగా రూ.250 ఫీజు చెల్లించాలి. అభ్యర్థుల ఎంపికలో 3 దశలున్నాయి. 1. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుపుతారు. ఎంపికైన వారికి శాలరీతోపాటూ.. రకరకాల అలవెన్సులు, ఇతర వెసులుబాట్లు కూడా ఉంటాయి.
No comments:
Post a Comment