Mother Tongue

Read it Mother Tongue

Sunday, 18 August 2024

డిఎస్సీ 2024 రిజల్ట్స్ ఆ రోజే..! కొత్త టీచర్లపై రేవంత్ సర్కార్ సూపర్ ప్లాన్

 ఉపాధ్యాయ నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే మెగా డిఎస్సీ నిర్వహించిన రేవంత్ సర్కార్.. అతి త్వరలో సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసి నియామక పత్రాలు అందజేయాలని ప్లాన్ చేస్తోంది. మెగా డిఎస్సీ 2024కి సంబంధించి ఇటీవలే ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ కీ పై అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు 20వ తేదీతో ఈ గడువు కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో TG DSC రిజల్ట్స్‌కి సంబంధించి మరో కీలక విషయం బయటకొచ్చింది.

సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్లను నియమించాలనే ఉద్దేశంతో ఉన్న సర్కార్.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరణ పూర్తయిన వెంటనే ఫైనల్ కీని రిలీజ్ చేసి, అనంతరం జనరల్ ర్యాకింగ్ లిస్టు (TS DSC 2024 Results)ను ప్రకటించనున్నారని సమాచారం. ఈ లెక్కన చూస్తే ఆగస్టు మూడో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రిజల్ట్స్ వదిలిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆ వెంటనే నియామక పత్రాలు ఇవ్వనున్నారట.

తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మెగా డీఎస్సీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి స్వీకారం చుట్టింది. ఇందులో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు.. 182 పీఈటీలు.. 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

అయితే ఈ సారి టీచర్ పోస్టులకు ఎంపికైన వారికి సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కసరత్తులు మొదలు పెట్టారట.



అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:

SSC CHTE

Apply Online

(25/08/2024 Last Date)

ఎక్సమ్ డేట్స్:

SSC MTS

Get Notice

(30-09-2024 to 14-11-2024 Exam Date)

ఎక్సమ్ కాల్ లెటర్ డౌన్లోడ్:

IBPS CRP Clerk XIV

Download Hall Ticket

(24, 25, & 31-08-2024 Exam Date)

RRB ALP

Get Notice

(28-08-2024 to 06-09-2024 Exam Date)

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

No comments:

Post a Comment

Job Alerts and Study Materials