స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) స్టెనోగ్రాఫర్ పరీక్ష 2024 నోటిఫికేషన్‌ను రీసెంట్ గా విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు అనగా ఆగస్టు 17, 2024న ముగుస్తుంది. అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ లో అప్లై చేసుకోవచ్చు. గ్రేడ్ సి, గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్‌ల కోసం 2,006 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 27 నుండి 28, 2024 వరకు అప్లికేషన్స్ లో దిద్దుబాటును అందుబాటులో ఉచనున్నారు. పరీక్ష అక్టోబర్-నవంబర్ 2024లో నిర్వహించబడుతుంది.
SSC స్టెనోగ్రాఫర్ పరీక్ష అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ స్థాయి పోటీ పరీక్ష. ఈ పరీక్షలో భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో గ్రేడ్ C (గ్రూప్ B నాన్-గెజిటెడ్) మరియు గ్రేడ్ D (గ్రూప్ C) స్థానాలకు స్టెనోగ్రాఫర్‌లను నియమిస్తారు.
అర్హతలు:
అభ్యర్థులు 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. గ్రేడ్ సి నమోదుకు వయోపరిమితి 18 నుండి 30 సంవత్సరాలు. (ఆగస్టు 2, 1994 మరియు ఆగస్టు 1, 2006 మధ్య జన్మించినవారు). గ్రేడ్ D నమోదు కోసం, ఇది 18 నుండి 27 సంవత్సరాలు (ఆగస్టు 2, 1997 మరియు ఆగస్టు 1, 2006 మధ్య జన్మించినవారు)
దరఖాస్తు రుసుము జనరల్, OBC అభ్యర్థులకు రూ.100. SC/ST/PWD/Ex-servicemen మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.
SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2024: పరీక్షా సరళి
ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) తర్వాత స్టెనోగ్రఫీలో నైపుణ్య పరీక్ష ఉంటుంది. CBEలో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విభాగాలు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. పరీక్ష యొక్క మొత్తం పరీక్ష వ్యవధి 2 గంటలు మరియు ప్రశ్నలు హిందీ మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ సెట్ చేయబడతాయి.
No comments:
Post a Comment