Mother Tongue

Read it Mother Tongue

Friday, 2 August 2024

NABARD: 89 వేల జీతంతో గవర్నమెంట్ జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండిలా..!

 నేషనల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌- నాబార్డు (NABARD) తాజాగా జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ వివరాలు చూడండి. 

నేషనల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌- నాబార్డు (NABARD) తాజాగా జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ శాఖల్లో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకై ఈ జాబ్ నోటిఫికేషన్‌ ఇచ్చారు. మొత్తం 102 అసిస్టెంట్ మేనేజర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు 60 శాతం మార్కులతో డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. మొత్తం రెండు దశల్లో రాతపరీక్షలు నిర్వహించి.. అనంతరం సైకోమెట్రిక్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ ఆగస్టు 15.

విభాగాల వారీగా ఖాళీలు చూస్తే..

జనరల్, ఫైనాన్స్, కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చార్టర్డ్ అకౌంటెంట్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్రీ, ప్లాంటేషన్ అండ్‌ హార్టికల్చర్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫిషరీస్, డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, సివిల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/ సైన్స్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, రాజ్‌భాష తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు దరఖాస్తు రుసుము రూ.150. అలాగే అభ్యర్థులకు 01.07.2024 నాటికి 21-30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం నెలకు రూ.44,500 - రూ.89,150 వరకు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేయండి.



2 comments:

Job Alerts and Study Materials