గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ వివిధ విభాగాల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం సాధిస్తే భారీ జీతాలు, అలవెన్స్‌లతో పాటు కెరీర్‌కు భరోసా లభిస్తుంది. అందుకే ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. తాజాగా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ వివిధ విభాగాల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు గెయిల్ అధికారిక పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు సెప్టెంబర్ 7న ముగుస్తుంది.
ఖాళీల వివరాలు
గెయిల్ నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తంగా 391 పోస్టులను భర్తీ చేస్తుంది. అందులో జూనియర్ ఇంజనీర్ కెమికల్- 2, జూనియర్ ఇంజనీర్ మెకానికల్- 1, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్- 1, ఫోర్‌మాన్ (ఎలక్ట్రికల్)-1, ఫోర్‌మాన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-14, ఫోర్‌మాన్ (సివిల్)-6, జూనియర్ సూపరింటెండెంట్ (అధికారిక భాష)-5, జూనియర్ కెమిస్ట్-8, జూనియర్ అకౌంటెంట్-14, టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబ్)-3, ఆపరేటర్ (కెమికల్)-73, టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)-44, టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-45, టెక్నీషియన్ (మెకానికల్)- 39, టెక్నీషియన్ (టెలికాం అండ్ టెలిమెట్రీ)-11, ఆపరేటర్ ఫైర్- 39, ఆపరేటర్ బాయిలర్-8, అకౌంట్స్ అసిస్టెంట్-13, బిజినెస్ అసిస్టెంట్- 65 పోస్టులు ఉంటాయి.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్
పోస్టుల ఆధారంగా విద్యాఅర్హతలు వేర్వేరుగా ఉంటాయి. జూనియర్ ఇంజనీర్ అండ్ ఫోర్‌మెన్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో డిప్లొమా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. జూనియర్ ఇంజనీర్స్ అభ్యర్థులకు ఎనిమిదేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. ఫోర్‌మెన్ పోస్టులకు రెండేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ఉండాలి.
జూనియర్ సూపరింటెండెంట్(హిందీ) పోస్టులకు, కనీసం 55 శాతం మార్కులతో హిందీ సాహిత్యం/హిందీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. జూనియర్ కెమిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే, అభ్యర్థులు కెమిస్ట్రీలో కనీసం 55 శాతంతో MSc పూర్తి చేసి ఉండాలి, రెండేళ్ల పని అనుభవం కూడా అవసరం.
ఆపరేటర్ (కెమికల్) పోస్టులకు కనీసం 55 శాతం మార్కులతో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్‌లో బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. బిజినెస్ అసిస్టెంట్ జాబ్ రోల్‌కు కనీసం 55 శాతం మార్కులతో BBA లేదా BBM డిగ్రీతో పాటు ఒక సంవత్సరం వర్క్ ఎక్స్ పీరియన్స్ తప్పనిసరి.
సెలక్షన్ ప్రాసెస్
అప్లై చేసుకున్న వారికి ముందు ఆన్‌లైన్ రాత పరీక్ష, ఆ తరువాత ట్రేడ్ టెస్ట్, చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా గెయిల్ పోర్టల్ www.gailonline.com ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లి ‘గెయిల్ నాన్ - ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్-2024’ అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
- ఆ తరువాత ‘అప్లైనౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
- ముందు పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. అనంతరం రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
- అన్ని వివరాలు ఎంటర్ చేసి, అప్లికేషన్ ఫిలప్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.
జీతభత్యాలు
జూనియర్ ఇంజనీర్ నెల జీతం రూ 35,000 నుంచి రూ.1,38,000 మధ్య లభిస్తుంది. ఫోర్‌మెన్- రూ. 29,000- రూ.1,20,000; జూనియర్ సూపరింటెండెంట్ రూ 29,000-రూ.1,20,000; జూనియర్ కెమిస్ట్- రూ.29,000-రూ.1,20,000; జూనియర్ అకౌంటెంట్- రూ. 29,000-రూ.1,20,000; టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబ్)- రూ 24,500- రూ 90,000; ఆపరేటర్ (కెమికల్)- రూ 24,500- రూ.90,000 మధ్య జీతం ఉంటుంది.
No comments:
Post a Comment