పేదలకు, మహిళలకు లబ్ది చేకూరే పథకాలతో పాటు నిరుద్యోగ సమస్యపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. ఈ నేపథ్యంలోనే తాజాగా కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా మెప్పు పొందుతున్నాయి. పేదలకు, మహిళలకు లబ్ది చేకూరే పథకాలతో పాటు నిరుద్యోగ సమస్యపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేశారు.
మరోవైపు ఇప్పటికే మెగా DSC నోటిఫికేషన్ వదిలి పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై కసరత్తులు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నిరుద్యోగులు పండగ చేసుకునే మరో అప్‌డేట్ ఇచ్చారు సీఎం రేవంత్.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 30 వేల ఉద్యోగాల భర్తీ చేశామని చెప్పిన సీఎం.. ఇకపై ఏటా 60 వేల ఉద్యోగాల భర్తీ జరుగుతుందని అన్నారు. ఖమ్మలో జరిగిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా ఈ ప్రకటన చేశారు సీఎం.
ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా స్పష్టమైన జాబ్ క్యాలండర్‌ను ప్రకటించబోతున్నామని పలుసార్లు స్పష్టం చేసిన సీఎం.. దీనిపై ఫైనల్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశారు.
ప్రతి ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్ కన్ఫర్మ్ చేశారు.
రాష్ట్రంలోని నిరుద్యోగులను సంతోషపెట్టేలా జాబ్ క్యాలెండర్ ఇచ్చామని, ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అదేవిధంగా విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై ప్రధానంగా దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి.
జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఏటా 60 వేల ఉద్యోగాల భర్తీ జరిగితీరుతుందని సీఎం చెప్పడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో ఉద్యోగార్థులంతా తిరిగి కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని చెబుతున్న సీఎం.. ఇకపై ఇలా జరగకుండా TSPSC ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరిగి తీరుతుందని ఎప్పటికప్పుడు హామీ ఇస్తున్నారు.
No comments:
Post a Comment