మీరు ప్రైవేట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా.. వేలల్లో శాలరీ అందుకోవాలని ఉందా.. ఈ ఛాన్స్ మాత్రం మిస్ కావద్దు.
నిరుద్యోగ యువతీ యువకులకు ఇదో సువర్ణ అవకాశమనే చెప్పాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళాను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 50కి పైగా ప్రైవేట్ కంపెనీలతో మెగా జాబ్ మేళా కాగా.. పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పన కోసమే చేస్తున్న మంచి ప్రయత్నమని అధికారులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ, యువకులను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. హైదరాబాద్ మహా నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ, ఫార్మా,రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మార్కెటింగ్ ఆటోమొబైల్స్, మేనేజ్మెంట్, సెక్యూరిటీ, ఎంఎన్సిలకు చెందిన 50కి పైగా కంపెనీలతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో ఆగస్టు 25 ఆదివారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు.
మెగా జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ, శుభ గృహ అనుభవ్ సాఫ్ట్ , వరుణ్ మోటార్స్, ఐటిసి ఫుడ్స్, రానే బ్రేక్ లైనర్స్ మ్యాను ఫ్యాక్చరింగ్ కంపెనీ మొదలగు ప్రముఖం కంపెనీలు, విప్రో ఇన్ఫోసిస్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీల అనుబంధ సంస్థలు 5 వేలకు పైగా ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని 10వ తరగతి నుంచి పిజి వరకు ఉత్తీర్ణత సాధించి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చెప్పారు. వేములవాడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం-డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రాజన్న సిరిసిల్ల అద్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా పోస్టర్ ను ప్రభుత్వ విప్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25వతేదిన వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు.. హైదరాబాద్ నుంచి సుమారు 50 కి పైగా కంపెనీలు వస్తున్నాయని ఎంపిక అయిన వారికి ఆ రోజు నియామక పత్రాలు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యువతకు తోడ్పాటు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని గుర్తు చేశారు.
No comments:
Post a Comment