ఆసక్తి గల నిరుద్యోగ యువత రెజ్యూమ్ , ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు, జిరాక్స్ సర్టిఫికెట్లతో ఆగష్టు 13న ఉదయం 9:30 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనేక మారుమూల గిరిజన గ్రామాలలో నేటికీ నాగరిక సమాజపు కొత్త పోకడలకు దూరంగా తమ కట్టు, బొట్టూ, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలతో గిరిజనులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక గిరిజన గ్రామాలు సరైన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో నివసిస్తున్న అడవి బిడ్డల సమస్యలను పరిష్కరించేందుకు, విద్యా, వైద్యం, ఉపాధి తదితర విభాగాలలో గిరిజనులకు సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ప్రభుత్వం ఇదివరకే సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసింది.
ఇలా ఏర్పాటైన సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఐటీడీఏ కార్యాలయం ఒకటి. ఈ కార్యాలయం కేంద్రంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు తదితర జిల్లాలో నివసించే ఆదివాసి ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు విశేష కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం ఐటిడిఏ గిరిజన యువకులకు ఉపాధిని కల్పించే లక్ష్యంతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బి. రాహుల్ లోకల్ 18 తో ముచ్చటిస్తూ జాబ్ మేళాకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో గల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆగష్టు 13న సూమారు 20 కంపెనీలతో మెగా జాబ్ మేళాను భద్రాచలం కేంద్రంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు.
ఈ జాబ్ మేళాలో శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్, మోర్, అపోలో ఫార్మసీ, నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్, పేటియం, వరుణ్ మోటార్స్, జిఎంఆర్ కార్గో, ఎల్ఐసి ఇండియా, గ్లాండ్ ఫార్మా, కె ఎస్ టే కర్స్, స్విగ్గి, వంటి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ గిరిజన యువత రెజ్యూమ్ , ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు, జిరాక్స్ సర్టిఫికెట్లతో ఆగష్టు 13న ఉదయం 9:30 గంటలకు గిరిజన భవనం ఐటిడిఏ భద్రాచలం ప్రాంగణము నందు ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన కోరుతూ, అర్హత గల నిరుద్యోగ గిరిజన యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆయన నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించి పూర్తి సమాచారం కొరకు 8143840906, 6302608905 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment