బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మరో కొత్త రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభమైంది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ప్రముఖ బ్యాంక్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
పోటీ పరీక్షలకు, ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మరో కొత్త రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభమైంది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ బ్యాంక్ తాజాగా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) స్కేల్-1 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్నవారు బ్యాంక్ అధికారిక పోర్టల్ indiabank.in విజిట్ చేసి సెప్టెంబర్ 2లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
* ఖాళీల వివరాలు
ఇండియన్ బ్యాంక్ తాజా రిక్రూట్‌మెంట్ ద్వారా దేశ వ్యాప్తంగా 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తుంది. అందులో ఏపీ, తెలంగాణలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
* వయోపరిమితి
2024 జులై 1 నాటికి 20-30 ఏళ్ల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారు ఇండియన్ బ్యాంక్ లేటెస్ట్ రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకోవడానికి అర్హులు.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా ఇండియన్ బ్యాంక్ పోర్టల్ indiabank.in ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లి ‘ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్-2024’ అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
- ఆ తరువాత ‘అప్లై నౌ’ ఆప్షన్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
- ముందు పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
- అనంతరం రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
- అన్ని వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.
* అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 పేమెంట్ చేయాలి.
* సెలక్షన్ ప్రాసెస్
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మూడు స్టెప్స్ ఉంటాయి. మందు రాత పరీక్ష నిర్వహిస్తారు, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. త్వరలోనే ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటన ఉంటుంది.
* ఎగ్జామ్ ప్యాట్రన్
పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ మోడల్‌లో ఉంటుంది. పరీక్షలో మొత్తంగా నాలుగు సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 45 ప్రశ్నలు, జనరల్/బ్యాంకింగ్/ఎకానమీ అవేర్‌నెస్- 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-35 ప్రశ్నలు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మొత్తం 200 మార్కులు ఉంటుంది. పరీక్ష వ్యవధి 180 నిమిషాలు.
* జీతభత్యాలు
ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.48,480 వరకు లభిస్తుంది. మరిన్ని వివరాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేయవచ్చు.
No comments:
Post a Comment