తెలంగాణలో మరో 6 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పటికే మెగా డీఎస్సీ నిర్వహించిన ప్రభుత్వం.. మరో ఉద్యోగ ప్రకటనకు సిద్ధమవుతోంది.
సీఎం పీఠం ఎక్కిన తర్వాత పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగంపై ఫోకస్ పెట్టిన రేవంత్.. అందుకు తగ్గట్లుగా ఉద్యోగాల ప్రకటనకు సిద్ధమవుతున్నారు.
నిరుద్యోగుల్లో ఉన్న అయోమయాన్ని తొలగించేలా ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఉద్యోగాల భర్తీ మరింత పారదర్శకంగా ఉండాలని, ఎగ్జామ్ డేట్స్ విషయంలో నిరుద్యోగుల్లో ఎలాంటి ఆందోళన ఉండొద్దని భావించిన తెలంగాణ సర్కార్.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.
మరోవైపు ఇప్పటికే మెగా డీఎస్సీ నిర్వహించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ, సాధారణ గురుకులాల్లో 6వేలకు పైగా పోస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని కూడా వీలైనంత త్వరలో భర్తీ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
2023లో ఇచ్చిన నోటిఫికేషన్లో 1,800కుపైగా బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నట్లు అంచనా వేశారు అధికారులు. ఈ క్రమంలోనే డీఎల్ , జేఎల్, పీజీటీ, టీజీటీతోపాటు వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను 2025-26 జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయనున్నట్లు సమాచారం. డీఎస్సీ, జేఎల్ నియామకాల తర్వాత మొత్తం ఖాళీలపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు.
గతేడాది గురుకులాల్లో ఉన్న పోస్టులకు సరైన సమయంలో ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో భర్తీకి అనుమతి లభించలేదు. కాబట్టి ఈ పోస్టులన్నీ కలిపితే గురుకులాల్లో దాదాపు 6 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
నిరుద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, వారికి న్యాయం చేసేలా విధివిధానాలు రెడీ చేస్తోంది రేవంత్ సర్కార్. ముఖ్యంగా ప్రభుత్వ ఖాళీల భర్తీపై స్పెషల్ ఫోకస్ పెట్టి వరుస నోటిఫికేషన్స్ ఇస్తున్నారు.
No comments:
Post a Comment