నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఖాళీలు
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా యూపీఎస్సీ మొత్తం 82 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో 67 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్, 15 క్యాబిన్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ ఖాళీలు ఉన్నాయి.
* అర్హతలు
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్కియాలజీ/ ఇండియన్ హిస్టరీ(పురాతన భారతీయ చరిత్ర లేదా మధ్యయుగ భారతదేశ చరిత్ర ఒక సబ్జెక్టుగా)లో మాస్టర్ డిగ్రీ లేదా ఆంత్రపాలజీ (రాతియుగపు పురావస్తు శాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా)/ జియాలజీ(ప్లిస్టోసీన్ జియాలజీని ఒక సబ్జెక్టుగా)లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఆర్కియాలజీలో పీజీ లేదా అడ్వాన్సుడ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఆర్కియాలజీ విభాగంలో మూడేళ్ల ఫీల్డ్ అనుభవం గల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు, క్యాబిన్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్ పోస్టుకు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.
* వయోపరిమితి
పై పోస్టులకు 35 ఏళ్ల లోపు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంది. దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంది. అంటే 45 ఏళ్ల లోపు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* అప్లికేషన్ ఫీజు
అభ్యర్థులు రూ. 25 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్‌లో క్యాష్ ద్వారా లేదా ఏదైనా బ్యాంకుకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా వీసా మాస్టర్ రూపే క్రెడిట్ డెబిట్ కార్డు యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
* సెలక్షన్ ప్రాసెస్
ముందుగా ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో 100 మార్కులు కేటాయించారు. కేటగిరీ, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
* జీత భత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు 7వ సెంట్రల్ పే కమిషన్ లెవల్ 10 పే స్కేలు ఆధారంగా వేతనాలు ఉంటాయి. ప్రతినెలా రూ. 56,000 నుంచి రూ. 1.77 లక్షల వరకు వేతనం అందుతుంది. దీనితో పాటు అదనపు సౌకర్యాలు సైతం ఉంటాయి.
No comments:
Post a Comment