ఎన్ ఎం ఎం ఎస్ పరీక్షలో ఎంపికైయితే చాలు తరగతి బట్టి కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేయడం జరుగుతుంది. ఇందులో కులాల వారీగా దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఎన్ ఎం ఎం ఎస్ పరీక్షలో ఎంపికైయితే చాలు తరగతి బట్టి కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేయడం జరుగుతుంది. ఇందులో కులాల వారీగా దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉన్నత చదువులకు ఈ నగదు వినియోగం అవుతుందని తెలిపారు.
ఇందులో పరీక్ష రాయాలి అంటే కచ్చితంగా ఎన్ సి ఆర్ టీ గుర్తింపు ఉంటే ఈ పరీక్షకు అర్హులన్నారు. తల్లిదండ్రులకు కొంచెం తోడుగా ఉపాధి అందించే స్కీం అని కూడా చెప్పవచ్చు. ఇందులో మినహాయింపుగా వసతులు లేని ఏపీ ఆదర్శ పాఠశాలలకు అవకాశం ఇచ్చారు.
దీన్ని గుర్తించి అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఇదే క్రమంలోనే అన్నమయ్య జిల్లా, రాయచోటి జగదాంబ సెంటర్ 2024-25 విద్యా సంవత్సరంలో జరగనున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్ష కోసం 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి శివప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సి పల్, ఎయిడెడ్, ఎంపీపీ పాఠశాల, వసతి సౌకర్యం లేని ఏపీ ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ, కుటుంబ సంవత్సర ఆదాయం రూ.3.50 లక్షలలోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు.
ఈ పరీక్ష డిసెంబర్ 8వ తేదీన జరు గుతుందన్నారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50. ఉంటుంది. వివరాలకు www.bre.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని డీఈఓ తెలిపారు.
No comments:
Post a Comment