రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పారా మెడికల్ కేటగిరీలో వివిధ పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఆగస్టు 8న విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించడానికి చివరి తేదీ 16 సెప్టెంబర్ 2024.
డైటీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్, క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజీనిస్ట్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ వంటి పారా మెడికల్ కేటగిరీల్లో వివిధ పోస్టులకు మొత్తం 1,376 ఖాళీలు ఉన్నాయి. అహ్మదాబాద్, ముజఫర్‌పూర్, చెన్నై, అజ్‌మేర్, పట్నా, బెంగళూరు, గోరఖ్‌పూర్, గువాహటి, ప్రయాగ్‌రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బిలాస్‌పూర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం, కోల్‌కతా తదితర రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టును బట్టి 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ విద్యార్హతలుగా నిర్ణయిచారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://indianrailways.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఈ పోస్టుల్లో..
ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) పోస్టులు: 246
నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు: 713
హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-III పోస్టులు: 126
డైటీషియన్ (లెవల్-7) పోస్టులు: 05
అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు : 04
క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు: 07
డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు: 03
ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ పోస్టులు: 27
డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు: 20
పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు: 02
ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II పోస్టులు: 20
ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు: 02
క్యాథ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు: 02
రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టులు: 64
స్పీచ్ థెరపిస్ట్ పోస్టు: 01
ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 13
ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టులు: 94
ఫీల్డ్ వర్కర్ పోస్టులు: 19
కార్డియాక్ టెక్నీషియన్ పోస్టులు: 04
ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు: 04
దరఖాస్తు రుసుము:
షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ, మాజీ సైనికోద్యోగి, పిడబ్ల్యుబిడి, స్త్రీ, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఇబిసి) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 250. ఇది కాకుండా, అన్ని ఇతర కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500.
CBT పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల దరఖాస్తు రుసుము బ్యాంక్ ఛార్జీలను తీసివేసిన తర్వాత తిరిగి ఇవ్వబడుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా UPI ఉపయోగించి ఆన్‌లైన్‌లో చేయవచ్చు. సెప్టెంబర్ 17 నుంచి 26 వరకు మీరు సమర్పించిన దరఖాస్తులకు సవరణ చేసుకునే అవకాశం కల్పిచారు.
No comments:
Post a Comment