Mother Tongue

Read it Mother Tongue

Sunday, 15 January 2023

సెక్రటేరియల్ ఎబిలిటీస్

1) ఈ సంఖ్యల క్రమంలో వచ్చు తర్వాత సంఖ్య ఏది? 5, 11, 21, 43, 85

1) 169

2) 171

3) 172

4) 168

2) 7, 10, 13, 16, 19, ... అదే సంఖ్యల క్రమంలో 151 ఎన్నో సంఖ్య అవుతుంది?

1) 48 వది 

2) 47 వది 

3) 50 వది 

4) 49 వది 

3) ఈ సిరీస్ లో తరువాత వచ్చే అక్షరాలు ఏవి?

BEI, DGK, FIM, _______

1) LOS 

2) HKN 

3) HKO 

4) LOR 

4) ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లో, మూడు ఒక విధంగా సంబధ్దం కలిగి ఉన్నాయి. భిన్నంగా ఉన్న దానిని కనుగొనండి?

1) తెలంగాణ 

2) కర్ణాటక 

3) చెన్నై 

4) కేరళ 

5) ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లో మూడు ఒక విధంగా సంబంధం కలిగి ఉన్నాయి. భిన్నంగా ఉన్న దానిని కనుగొనండి?

1) పావురం 

2) చిలుక 

3) కాకి 

4) పక్షి 

6) ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లో మూడు ఒక విధంగా సంబంధం కలిగి ఉన్నాయి. భిన్నంగా ఉన్న దానిని కనుగొనండి?

1) 15

2) 23

3) 17

4) 29

7) ఈ క్రింది ప్రశ్నలలో మొదటి రెండు పదాలలో ఒక విధమైన సంబంధం కలదు. మూడవ పదంతో ఆ  రకమైన సంబంధం కలిగిన నాల్గవ పదాన్ని గుర్తింపుము?

ఎగుమతి : దిగుమతి :: ఆదాయం : ?

1) అప్పు 

2) లోటు 

3) లాభం 

4) వ్యయం 

8) ఈ క్రింది ప్రశ్నలలో మొదటి రెండు పదాలలో ఒక విధమైన సంబంధం కలదు. మూడవ పదంతో ఆ  రకమైన సంబంధం కలిగిన నాల్గవ పదాన్ని గుర్తింపుము?

WATCH : CHTAW :: PLATE : ?

1) TEAPL 

2) TEPAL 

3) TELPA 

4) TEALP 

9) ఈ క్రింది ప్రశ్నలలో మొదటి రెండు పదాలలో ఒక విధమైన సంబంధం కలదు. మూడవ పదంతో ఆ  రకమైన సంబంధం కలిగిన నాల్గవ పదాన్ని గుర్తింపుము?

నడక : కాళ్ళు :: ఆలోచన : ?

1) తల

2) మెదడు 

3) గుండె 

4) చెవులు 

10) ఒక కోడ్ భాషలో 'BOLD' ను 3492 గాను 'FINE' ను  5716 గాను రాసినచో, 'FILED' అను దానిని ఆ కోడ్ లో ఎలా రాస్తారు?

1) 57962

2) 57692

3) 57926

4) 57269 

11) ఒక వేళా తెలుపును ఎరుపుగాను, ఎరుపును నీలంగాను, నీలంను ఆకు పచ్చగాను, ఆకుపచ్చను పసుపుగాను అనుకుంటే, ఆకాశము ఏ రంగులో ఉంటుంది?

1) ఎరుపు 

2) ఆకుపచ్చ 

3) పసుపు పచ్చ

4) నీలం 

12) ఒక కోడ్ లో 'ya mi te' అనగా క్రమంగా కసరత్తు చేయుము, అనియు, 'ya no ka' అనగా 'కసరత్తు ఆరోగ్యాన్ని ఇస్తుంది' అనియు మరియు 'bu ka di' అనగా 'ఆరోగ్యం ఒక మహా భాగ్యం' అనియు సూచిస్తే, 'ఆరోగ్యం' ను సూచించే కోడ్ ఏది?

1) ya 

2) te 

3) di 

4) ka  

13) ఒక వ్యక్తిని చూపిస్తూ Mr. ప్రసాద్ ఇలా అన్నాడు. "ఇతను నా కూతురు యెక్క తాతగారు' . ఆ వ్యక్తి యెక్క భార్య ప్రసాద్ కు ఏమవుతుంది.  

1) సోదరి 

2) తల్లి 

3) మరదలు 

4) కోడలు 

14) ప్రభు కూతురైన ప్రియాంకకు శ్రావ్య సోదరి అవుతుంది. ప్రభు సోదరి అయినా రమకు మనీష్ కుమారుడు అయినచో, మనీష్ కు శ్రావ్య ఏమవుతుంది?

1) కజిన్ 

2) సోదరి 

3) వదిన/ మరదలు 

4) తల్లి 

15) ఒకవేళ A+B అనగా A, B కి భార్య అనియు, B-C  అనగా C, B కి తండ్రి అయినచో, R + P - Q అను దానిలో R అనువారు Q కు ఏమి అవుతారు?

1) కూతురు 

2) తండ్రి 

3) కోడలు 

4) మామగారు 

16) తూరుపు వైపు చూస్తున్న ఒక వ్యక్తి 45 డిగ్రీ కోణం తో ఎడం వైపుకు తిరిగి మరలా 180 డిగ్రీ అతని కుడివైపు కు తిరిగినచో, ఆతను ప్రస్తుతం ఏ వైపునకు చూస్తున్నాడు?

1) దక్షిణం 

2) నైరుతి 

3) ఆగ్నేయం 

4) పడమర 

17) దక్షిణం వైపు చూస్తున్న వ్యక్తి 4 కిలో మీటర్ల దూరం నడిచిన తరువాత అతని ఎడమ వైపుకు తిరిగి మరొక 3 కిలో మీటర్లు నడిచినచో ఆతను బయలుదేరిన స్తానం నుంచి ఎంత?

1) 8 km 

2) 7 km

3) 5 km

4) 4 km

18) A, B, C, మరియు D అను నాలుగు గ్రామాలు కలవు. A కు ఆగ్నేయంలో B కలదు. B కు ఉత్తరం వైపు మరియు A కు ఈశాన్యం వైపు C కలదు . B కు పడమరలో C మరియు A కు సరళ రేఖలో D కలదు. D, A కి ఏ వైపున ఉన్నది?

1) నైరుతి 

2) దక్షిణం 

3) పడమర 

4) ఈశాన్యం 

19) ఈ క్రింది ఇచ్చిన అంకెల క్రమంలో ఎన్ని 7 (ఏడు) అంకెలు వాటి ముందు సరి సంఖ్యలు వచ్చినవి ఉన్నాయి?

6 4 5 7 3 2 7 1 8 9 7 3 4 7 8 2 6 7 5 8 7 2 9 7 

1) రెండు 

2) మూడు 

3) నాలుగు 

4) ఏడు 

20) ఒక బాలికల తరగతిలో రామ పై నుంచి 8 వ స్థానంలోను, పద్మ కింది నుంచి 8వ స్థానంలో ఉన్నారు. వారు పరస్పరం స్థానాలు మారినచో, రామ పై నుంచి 18వ స్థానంలో ఉంటుంది. ఆ తరగతిలో ఎంత మంది బాలికలు ఉన్నారు?

1) 26

2) 24

3) 27

4) 25

21) సంతోష్ పుట్టిన రోజు 17 అక్టోబర్ తరువాత మరియు 25 అక్టోబర్ ముందు అని అతని సహోద్యోగి మురళికి గుర్తుంది. కానీ సంతోష్ యొక్క పుట్టిన రోజు 19 అక్టోబర్ ముందు మరియు 10 అక్టోబర్ తరువాత అని శ్రీనుకు గుర్తుంది. సంతోష్ ఏ తేదీన తన పుట్టిన రోజు జరుపుకుంటాడు?

1) 19 అక్టోబర్ 

2) 17 అక్టోబర్ 

3) 18 అక్టోబర్ 

4)  అసంపూర్ణ దత్తాంశం 

22) ఒక వేళ '+', అనగా X, '-' అనగా /, 'X' అనగా + మరియు/ అనగా - అయినట్లయితే 36 - 6 + 2 X  8 - 2/3 యెక్క విలువ ఎంత?

1) 15

2) 16

3) 12

4) 13

23) ఒక వేళ '+' మరియు X, అలాగే '4' మరియు '5' పరస్పరం మారినట్లయితే, ఈ క్రింది వాటిలో సరైనది  ఏది?

1) 5 X  4 + 20 = 40

2) 5 X  4 + 20 = 85

3) 5 X  4 + 20 = 104

4) 5 X  4 + 20 = 95

24) ఒక వేళా P అనగా '+', Q అనగా '-', R అనగా X మరియు S అనగా / అయినట్లయితే, ఈ క్రింది వాటిలో సరైనది ఏది?

1) 3R4S2P5Q3 = 8

2) 4P3Q6S2R4 = 2

3) 6Q4P5R3S7 = 3

4) 5P3S4Q6R3 = -12

25) ఆరుగురు స్నేహితులు A, B, C, D, E మరియు F  అనువారు ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ మధ్యకు చూస్తూ కూర్చున్నారు. D కు ఎడమవైపు, F కు ఎదురుగా A  కూర్చున్నారు. F కు ఇరువైపులా E లేడు. కానీ C కి ఎదురుగా ఉన్నాడు. D కు ఎదురుగా కూర్చున్న వారు ఎవరు?

1) E 

2) B 

3) C 

4) F 

26) రవి కెమిస్ట్రీ లో ఫిజిక్స్ కన్నా అత్యధిక మార్కులు పొందాడు కానీ మాథ్స్ కన్నా కాదు. అతను ఫిజిక్స్ కన్నా ఇంగ్లీష్ లో తక్కువ మార్కులు పొందాడు కానీ తెలుగు కన్నా కాదు అతను  ఏ సబ్జెక్టులో రెండవ అత్యధిక మార్కులు పొందాడు. 

1) ఫిజిక్స్ 

2) మాథ్స్ 

3) కెమిస్ట్రీ 

4) ఇంగ్లీష్ 

27) ఇచ్చిన ఆంగ్ల పాదములను నిగంటువు ప్రకారం అక్షర క్రమంలో అమర్చి వాటి యెక్క సరైన క్రమాన్ని గుర్తించగలరు?

a) tumbler b) tabular c) tortoise d) torture e) tablet 

1) ebcda 

2) becda 

3) adcbe 

4) ebadc

28) "TABULATION" అనే పదములోని అక్షరములతో ఏర్పడని పదమును గుర్తించండి?"

1) LOTION 

2) TUITION 

3) TABLE 

4) NATIONAL 

29) IPL క్రికెట్ పోటీలో ఎనిమిది జట్ల తలపడుతున్నాయి. ప్రతి ఒక్క జట్టు మరొక జట్టుతో రెండుసార్లు తలపడుతాయి. రెండు క్వాలిఫయర్ మ్యాచ్లు, ఒక ఎలిమినేటర్ మ్యాచ్ మరియు ఫైనల్ మ్యాచ్ సహా మనం ఎన్ని మ్యాచ్ లు చూడగలం?

1) 56

2) 60

3) 64

4) 32

30) ప్రశ్నార్ధకం ఉన్నచోట ఉండవలసిన సంఖ్యను కనుగొండి?

2   29   5

3   90   9

4   ?     6

1) 50

2) 52

3) 60

4) 81

31) దిగువ రెండు ప్రకటనలు ఇన్వబడినవి మరియు ఆ తరువాత రెండు నిర్ణయాలు ఎ, బి లు కూడా ఇవ్వఇవ్వబడినవి. ఏ నిర్ణయము (లు) ఇచ్చిన ప్రకటనలననుసరించి ఉన్నాయో సరైన సమాధానంతో గుర్తించండి?

ప్రకటన: 

1) అన్ని సంచులు కేకులు 

2) అన్ని దీపములు కేకులు 

నిర్ణయం: 

ఎ ) కొన్ని దీపములు సంచులు 

బి) ఏ దీపము సంచి కాదు 

1) నిర్ణయం ఎ  మాత్రమే అనుసరిస్తుంది 

2) నిర్ణయం బి  మాత్రమే అనుసరిస్తుంది 

3) ఎ, బి లు రెండు అనుసరిస్తాయి. 

4) ఎ  కానీ బి కానీ అనుసరించదు 

32) దిగువ రెండు ప్రకటనలు ఇన్వబడినవి మరియు ఆ తరువాత రెండు నిర్ణయాలు ఎ, బి లు కూడా ఇవ్వఇవ్వబడినవి. ఏ నిర్ణయము (లు) ఇచ్చిన ప్రకటనలననుసరించి ఉన్నాయో సరైన సమాధానంతో గుర్తించండి?

ప్రకటన: 

1) అన్ని తలుపులు సూదులు  

2) కొన్ని చెట్లు తలుపులు  

నిర్ణయం: 

ఎ ) కొన్ని చెట్లు సూదులు  

బి) కొన్ని చెట్లు సూదులు కావు 

1) నిర్ణయం ఎ  మాత్రమే అనుసరిస్తుంది 

2) నిర్ణయం బి  మాత్రమే అనుసరిస్తుంది 

3) ఎ, బి లు రెండు అనుసరిస్తాయి. 

4) ఎ  కానీ బి కానీ అనుసరించదు 

33) దిగువ రెండు ప్రకటనలు ఇన్వబడినవి మరియు ఆ తరువాత రెండు నిర్ణయాలు ఎ, బి లు కూడా ఇవ్వఇవ్వబడినవి. ఏ నిర్ణయము (లు) ఇచ్చిన ప్రకటనలననుసరించి ఉన్నాయో సరైన సమాధానంతో గుర్తించండి?

ప్రకటన: 

1) కొందరు ఆటగాళ్లు, రచయితలు 

2) అందరు రచయితలు పొట్టివాళ్లు 

నిర్ణయం: 

ఎ ) కొందరు ఆటగాళ్లు పొట్టివాళ్లు 

బి) అందరు ఆటగాళ్లు పొట్టివాళ్లు 

1) నిర్ణయం ఎ  మాత్రమే అనుసరిస్తుంది 

2) నిర్ణయం బి  మాత్రమే అనుసరిస్తుంది 

3) ఎ, బి లు రెండు అనుసరిస్తాయి. 

4) ఎ  కానీ బి కానీ అనుసరించదు 

34) దిగువ రెండు ప్రకటనలు ఇన్వబడినవి మరియు ఆ తరువాత రెండు నిర్ణయాలు ఎ, బి లు కూడా ఇవ్వఇవ్వబడినవి. ఏ నిర్ణయము (లు) ఇచ్చిన ప్రకటనలననుసరించి ఉన్నాయో సరైన సమాధానంతో గుర్తించండి?

ప్రకటన: 

1) ఏ పురుషుడు గాడిద కాదు

2) రమేష్ గాడిద కాదు  

నిర్ణయం: 

ఎ )  రమేష్ ఒక పురుషుడు   

బి) అందరు పురుషులు రమేష్ కాదు 

1) నిర్ణయం ఎ  మాత్రమే అనుసరిస్తుంది 

2) నిర్ణయం బి  మాత్రమే అనుసరిస్తుంది 

3) ఎ, బి లు రెండు అనుసరిస్తాయి. 

4) ఎ  కానీ బి కానీ అనుసరించదు 

35) దిగువ రెండు ప్రకటనలు ఇన్వబడినవి మరియు ఆ తరువాత రెండు నిర్ణయాలు ఎ, బి లు కూడా ఇవ్వఇవ్వబడినవి. ఏ నిర్ణయము (లు) ఇచ్చిన ప్రకటనలననుసరించి ఉన్నాయో సరైన సమాధానంతో గుర్తించండి?

ప్రకటన: 

1) కొందరు న్యాయవాదులు పురుషులు 

2) ఏ పురుషుడు నల్లటి వాడు కాదు 

నిర్ణయం: 

ఎ )  కొందరు న్యాయ వాదులు నల్లటి వాళ్ళు కారు 

బి) కొందరు పురుషులు న్యాయవాదులు 

1) నిర్ణయం ఎ  మాత్రమే అనుసరిస్తుంది 

2) నిర్ణయం బి  మాత్రమే అనుసరిస్తుంది 

3) ఎ, బి లు రెండు అనుసరిస్తాయి

4) ఎ  కానీ బి కానీ అనుసరించదు 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials