APPSC Group 2 Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్–2 పోస్టులకు నిర్వహించే పరీక్ష విధానంలో మార్పులు చేసింది. ఇప్పటివరకు గ్రూప్–2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని 2 పేపర్లకు కుదించింది.
ప్రధానాంశాలు:
- ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023
- త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్
- పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం
పరీక్ష విధానంలో మార్పులు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
గ్రూప్–2 పోస్టులకు నిర్వహించే పరీక్ష విధానంలో మార్పులు చేసింది.
ఇప్పటివరకు గ్రూప్–2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని 2
పేపర్లకు కుదించింది. ఈ మేరకు ఇటీవల జీవో 6ను విడుదల చేసింది. పరీక్ష
విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
వీటిని ఆమోదిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
No comments:
Post a Comment