Mother Tongue

Read it Mother Tongue

Thursday, 12 January 2023

AP Police Constable Hall Ticket 2023 : ఏపీ కానిస్టేబుల్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

AP Police Constable Hall Ticket 2023: ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (SLPRB AP) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6100 కానిస్టేబుల్‌ పోస్టులున్నాయి. సివిల్‌ ఎస్సై, ఏపీఎస్సీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న, సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 2023 జనవరి 22న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు. అయితే.. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఎస్‌ఐ ఉద్యోగాలకు మాత్రం 2023 జనవరి 18వ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఇక.. కానిస్టేబుల్‌ అభ్యర్థులకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ (లింక్‌ ఇదే) చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

2 comments:

Job Alerts and Study Materials