South Central Railway : ఈ నోటిఫికేషన్ ద్వారా 4103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు.
RRC SCR Apprentice Recruitment 2023 :సికింద్రాబాద్ (Secunderabad) ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్ వర్క్‌షాప్/యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎస్‌సీఆర్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుచేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్ లేదా వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
No comments:
Post a Comment