Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 25 January 2023

మరో 451 కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు

CISF Constable Recruitment 2023 : ఈ నోటిఫికేషన్‌ ద్వారా 451 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 22లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు..

ప్రధానాంశాలు:

  • సీఐఎస్‌ఎఫ్‌ రిక్రూట్‌మెంట్‌ 2023
  • 451 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన
  • ఫిబ్రవరి 22 దరఖాస్తులకు చివరితేది
CISF Recruitment 2023 : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF).. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ పరిశ్రమల భద్రత నిమిత్తం కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్- ఫైర్‌ సర్వీస్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 451 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 22లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ.21,700 - రూ.69,100 వేతనం ఉంటుంది. వివరాల్లోకెళ్తే..

మొత్తం ఖాళీల సంఖ్య: 451
  • కానిస్టేబుల్/ డ్రైవర్: 183 పోస్టులు
  • కానిస్టేబుల్/ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (ఫైర్‌ సర్వీస్‌): 268 పోస్టులు
  • అర్హత: 10వ తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్(హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్; లైట్ మోటార్ వెహికల్; మోటార్ సైకిల్ విత్ గేర్)తో పాటు మూడేళ్ల డ్రైవింగ్‌ అనుభవం ఉండాలి.
  • శారీరక ప్రమాణాలు: ఎత్తు 167 సెం.మీ., ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి.
  • వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • జీత భత్యాలు: నెలకు రూ.21,700 - రూ.69,100 ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
  • ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://cisfrectt.in/index.php

No comments:

Post a Comment

Job Alerts and Study Materials