AP Grama Sachivalayam Jobs : సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ గత తాజాగా పంచాయతీరాజ్ శాఖకు లేఖ కూడా రాసింది. పోస్టులవారీగా ఖాళీల వివరాలను ఆ లేఖలో పేర్కొంది.
ప్రధానాంశాలు:
- ఏపీ సచివాలయం జాబ్స్ 2023
- 14,523 ఖాళీలు భర్తీ యోచన
- త్వరలో నోటిఫికేషన్లు జారీ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలోని గ్రామ, వార్డు
సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు
వెలువడనున్నాయి. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ
చేయనుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఫిబ్రవరిలో విడుదల చేసి.. ఏప్రిల్‌లోపే
ఖాళీల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలు పూర్తిచేసే యోచనలో అధికారులు
ఉన్నారు. ఈసారి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే భర్తీ ప్రక్రియను
పూర్తిచేయనున్నారు.
No comments:
Post a Comment