Mother Tongue

Read it Mother Tongue

Saturday, 14 January 2023

Andhra Pradesh : ఏపీలో మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది

AP Vaidya Vidhana Parishad : ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో 47 హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల భర్తీకి వైద్య శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన వైద్యులు జనవరి 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750 చొప్పున దరఖాస్తు రుసుం ఉంటుంది. https://dmeaponline.com/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచారు.

ఈ పోస్టులను రెండేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేపడతారు. ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ పూర్తి చేసి హాస్పిటల్‌ అడ్మిని­స్ట్రేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ/హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌/ఎంబీఏ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌/ఎంబీఏ హ్యూమన్‌ రీసోర్స్‌ కోర్సులు చేసి, ఇతర అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగు­లకు 10 ఏళ్లు వయోపరిమితి నుంచి మిన­హా­యింపు ఉంటుంది. http://hmfw.ap.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ అందుబాటులో ఉంది. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials