Mother Tongue

Read it Mother Tongue

Friday, 20 January 2023

71,000 మందికి జాబ్‌ ఆఫర్‌ లెటర్లు.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఇదో రికార్డ్‌..!

PM Rojgar Mela 2023 : నేడు (జనవరి 20) దాదాపుగా 71 వేల మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందించనున్నారు. ప్రధాని మంత్రి కార్యాలయం(పీఎంఓ) తాజాగా ఈ ప్రకటన విడుదల చేసింది.

Rozgar Mela 2023 : కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) జాబ్ లెటర్స్ అందించనున్నారు. నేడు (జనవరి 20) దాదాపుగా 71 వేల మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందించనున్నారు. ప్రధాని మంత్రి కార్యాలయం(PMO) తాజాగా ఈ ప్రకటన విడుదల చేసింది. PMO అందించిన సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీ (PM Modi) వీడియో కాన్పరెన్స్ ద్వారా ఉదయం 10.30 గంటలకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేస్తారని.. కొత్తగా ఉద్యోగంలో చేరబోతున్నవారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10 లక్షల మంది సిబ్బంది రిక్రూట్‌మెంట్ డ్రైవ్ “Rozgar Mela 2023” పేరుతో జరగనుంది. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశగా రోజ్‌గార్ మేళా ఒక ముందడుగు అని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేర్కొంది. రోజ్‌గార్ మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని.. యువతను వారి సాధికారత కోసం శక్తివంతం చేస్తుందని ఆశిస్తున్నాం. దేశాభివృద్ధిలో భాగస్వామ్యానికి అర్ధవంతమైన అవకాశాలను అందించందని వెల్లడించింది.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials