Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 31 January 2023

సికింద్రాబాద్‌ AOC సెంటర్‌లో 1749 జాబ్స్‌.. ఎంపికైతే రూ.56,900 వరకూ జీతం

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (AOC Secunderabad).. 1749 ట్రేడ్స్‌మ్యాన్‌ మెట్‌, ఫైర్‌మ్యాన్‌ (గ్రూప్‌ సీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు గడువు ముగుస్తుంది.

ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఫిజికల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టులకు నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతంగా చెల్లిస్తారు. ఫైర్‌మ్యాన్‌ పోస్టులకు నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 1749

  • ట్రేడ్స్‌మ్యాన్‌ మెట్‌ పోస్టుల సంఖ్య: 1249
  • ఫైర్‌మ్యాన్‌ పోస్టుల సంఖ్య: 544
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.aocrecruitment.gov.in/

2 comments:

Job Alerts and Study Materials