Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 11 January 2023

2022 ఇండియా రౌండప్‌ డిసెంబర్ 27, 2022

 




నియామకాలు

రక్షణ రంగం

గిరిధర్‌ అరమణే: రక్షణ శాఖ నూతన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గిరిధర్‌ అరమణే నవంబర్‌ 1న బాధ్యతలు స్వీకరించారు.
అనిల్‌ చౌహాన్‌: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా సెప్టెంబర్‌ 30న బాధ్యతలు చేపట్టారు. త్రివిధ దళాలకు మధ్య సమన్వయం తీసుకొచ్చేందుకు ఉద్దేశించింది ఇది. అంతకు ముందు ఈ పదవిలో ఉన్న బిపిన్‌ రావత్‌ తమిళనాడులో 2021, డిసెంబర్‌ 15న జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
మనోజ్‌ పాండే: భారత ఆర్మీ చీఫ్‌గా ఏప్రిల్‌ 30న బాధ్యతలు స్వీకరించారు.
సోమశేఖర రాజు: భారత 44వ వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా మే 1న బాధ్యతలు చేపట్టారు.
మనోజ్‌ కుమార్‌ కటియార్‌: డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌గా మనోజ్‌ కుమార్‌ కటియార్‌ మే 11న బాధ్యతలు స్వీకరించారు.
జీఏవీ రెడ్డి: డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌గా జనవరి 31న బాధ్యతలు స్వీకరించారు.
అశోక్‌ కుమార్‌: జాతీయ తీర భద్రత సమన్వయకుడిగా ఫిబ్రవరి 16న బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి. జాతీయ భద్రతా మండలి సచివాలయంలో భాగంగా ఈ పదవి ఉంటుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ నేతృత్వంలో అశోక్‌ కుమార్‌ తన విధులు నిర్వహిస్తారు.
శాస్త్ర-సాంకేతికం
సోమ్‌నాథ్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చైర్మన్‌గా జనవరి 15న బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌కు సారథ్యం వహించారు.
ఉన్ని కృష్ణన్‌ నాయర్‌: విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
వీ కామత్‌: భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో)కు కార్యదర్శిగా ఆగస్ట్‌ 26న బాధ్యతలు స్వీకరించారు.
నలతంబి కలైసెల్వి: కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌కు డైరెక్టర్‌ జనరల్‌గా ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ.
శేషు మాధవ్‌: ఆంధ్రపదేశ్‌లోని రాజమహేంద్ర వరంలో ఉన్న కేంద్ర పొగాకు పరిశోధన సంస్థకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన అంతకుముందు భారత వరి పరిశోధన సంస్థలో పని చేశారు.
ప్రకాశ్‌ కుమార్‌: జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎన్‌జీఆర్‌ఐను 1961లో ఏర్పాటు చేశారు. సీఎస్‌ఐఆర్‌కు అనుబంధంగా పనిచేస్తుంది. ఎన్‌జీఆర్‌ఐ ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లో ఉంది.
రాజీవ్‌ బహల్‌: భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఆయన చిన్నపిల్లల వైద్య నిపుణులు. ప్రజారోగ్య అంశంలో పరిశోధన చేశారు.
అనిల్‌ కుమార్‌: అంతర్జాతీయ వ్యోమగామి సమాఖ్యకు ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయన ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
రేణు సింగ్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
సురేశ్‌ ఎన్‌ పటేల్‌: సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా ఆగస్ట్‌ 3న నియమితులయ్యారు.
విశ్వనాథన్‌ ఆనంద్‌: ఫిడే డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఆగస్ట్‌ 7న ఎన్నికయ్యారు.
పీయూష్‌ గోయల్‌: నాట్‌గ్రిడ్‌ సీఈవోగా నియమితులయ్యారు.
నీతి ఆయోగ్‌
సుమన్‌ బెరి: నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా మే 1న బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఆయనకు క్యాబినెట్‌ మంత్రి హోదా ఉంటుంది.
పరమేశ్వరన్‌ అయ్యర్‌: నీతి ఆయోగ్‌ సీఈవోగా నియమితులయ్యారు. అంతకుముందు ఈ పదవిలో అమితాబ్‌ కాంత్‌ ఉండేవారు. పరమేశ్వరన్‌ అయ్యర్‌ గతంలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు నేతృత్వం వహించారు.
అర్వింద్‌ విర్‌మాని: నీతి ఆయోగ్‌ పూర్తి స్థాయి సభ్యుడిగా నియమితులయ్యారు. ఈయన ఫౌండేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ గ్రోత్‌ అండ్‌ వెల్ఫేర్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు.

కొత్త ముఖ్యమంత్రులు

ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, మళ్లీ ముఖ్యమంత్రి అధికారాన్ని చేపట్టిన తొలి వ్యక్తిగా యోగి ఆదిత్య నాథ్‌ నిలిచారు.
ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి ఎన్నికయ్యారు.
పంజాబ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ మార్చి 16న ప్రమాణం చేశారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది.
గోవా: గోవా 13వ ముఖ్యమంత్రిగా ప్రమోద్‌ సావంత్‌ మార్చిలో ప్రమాణం చేశారు.
హిమాచల్‌ ప్రదేశ్‌: హిమాచల్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సుఖ్విందర్‌ సింగ్‌ ఎన్నికయ్యారు.
గుజరాత్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ డిసెంబర్‌ 12న ప్రమాణం చేశారు.
మణిపూర్‌: మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బీరేన్‌ సింగ్‌ మార్చిలో ఎన్నికయ్యారు.

విద్యావ్యవస్థల్లో

జగ్‌దీశ్‌ కుమార్‌: యూజీసీ కొత్త చైర్మన్‌గా ఫిబ్రవరి 4న నియమితులయ్యారు. అంతకుముందు ఆయన ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా పనిచేశారు.
శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ.
దినేశ్‌ ప్రసాద్‌ సక్లాని: నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు ఈ పదవిలో రుషికేశ్‌ సేనాపతి ఉన్నారు.
న్యాయ వ్యవస్థలో
వెంకట రమణి: భారత 16వ ఆటర్నీ జనరల్‌గా అక్టోబర్‌ 1న ప్రమాణం చేశారు. అంతకు ముందు ఆ పదవిలో కేకే వేణుగోపాల్‌ ఉన్నారు.
రితు రాజ్‌ అవస్థి: 22వ న్యాయ కమిషన్‌ చైర్మన్‌గా నవంబర్‌ 9న బాధ్యతలు స్వీకరించారు. ఆయన కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ న్యాయ కమిషన్‌లో సభ్యులుగా కేటీ శంకరన్‌, ప్రొఫెసర్‌ ఆనంద్‌ పలివాల్‌, ప్రొఫెసర్‌ డీపీ వర్మ, ప్రొఫెసర్‌ రాకా ఆర్య, ఎం కరుణానిధి నియమితులయ్యారు

పరిపాలన-ఉన్నత వ్యవస్థల్లో

వినయ్‌ మోహన్‌ క్వాత్రా: విదేశాంగ శాఖకు నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న హర్స్‌ శ్రింగ్లా జీ-20 సమన్వయకుడిగా ఎంపికయ్యారు.
ఇక్బాల్‌ సింగ్‌ లాల్‌పురా: నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ మైనార్టీస్‌కు చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
తరుణ్‌ కపూర్‌: ప్రధాని నరేంద్రమోదీకి సలహాదారుగా తరుణ్‌ కపూర్‌ నియమితులయ్యారు. ఆయన గతంలో పెట్రోలియం శాఖలో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
నితిన్‌ గుప్తా: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఈయన 1986 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి.
తపన్‌ కుమార్‌ దేకా: ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.
ఎస్‌ రాజు: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా ఏప్రిల్‌ 1న బాధ్యతలు స్వీకరించారు.
రాజీవ్‌ గేరా: నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌కు డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.
నటరాజన్‌ సుందర్‌: నేషనల్‌ అస్సెట్స్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మే 30న బాధ్యతలు స్వీకరించారు.
డీజే పాండియన్‌: బ్రిక్స్‌ బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయం డైరెక్టర్‌ జనరల్‌గా నియమితుల య్యారు. ఈ కార్యాలయం గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఉంది.
గౌరవ్‌ ద్వివేది: ప్రసార భారతి సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
మాధబి పురీ బుచ్‌: సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ ఆమె.
దినకర్‌ గుప్తా: జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఈయన పంజాబ్‌ డీజీపీగా పనిచేశారు. 2024 మార్చి 31 వరకు ఈ పదవిలో ఉంటారు
అజయ్‌ భూషణ్‌ పాండే: నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీకి చైర్మన్‌గా నియమితులయ్యారు.

అవార్డులు

నోబెల్‌
14 మందికి లభించింది. ఆరు రంగాల్లో వీటిని ప్రకటించారు.
వైద్య రంగం: స్వాంటే పాబో. ఆయన స్వీడన్‌ దేశానికి చెందిన వారు.
సాహిత్యం: అనీ ఎర్నాక్స్‌. ఆమె ఫ్రెంచి రచయిత్రి.
శాంతి బహుమతి: అలెస్‌ బిలియాట్‌స్కీతో పాటు రష్యాకు చెందిన మెమోరియల్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌, ఉక్రెయిన్‌కు చెందిన ఆర్గనైజేషన్‌ సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌కు దక్కింది. అలెస్‌ బిలియాట్‌స్కీ బెలారస్‌ దేశానికి చెందిన వ్యక్తి.
భౌతిక శాస్త్రం: ఫ్రాన్స్‌కు చెందిన అలెన్‌ యాస్పెక్ట్‌, అమెరికాకు చెందిన జాన్‌ క్లాజర్‌, ఆస్ట్రియాకు చెందిన ఆంటోన్‌ జీలింగర్‌లకు లభించింది. క్వాంటమ్‌ మెకానిక్స్‌లో వాళ్లు పరిశోధనలు చేసినందుకు అవార్డ్‌ దక్కింది.
రసాయన శాస్త్రం: అమెరికాకు చెందిన కరోలిన్‌ బెర్డోజీ, బారీ షార్ప్‌లెస్‌, డెన్మార్క్‌ దేశానికి చెందిన మోర్టెన్‌ మెల్డల్‌లకు దక్కింది. క్లిక్‌ కెమిస్ట్రీతో పాటు బయో ఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలో పరిశోధన చేసినందుకు లభించింది.
ఆర్థికశాస్త్రం: అమెరికాకు చెందిన బెర్నాంకే, డైమండ్‌, డిబ్విగ్‌లకు లభించింది. బ్యాంకింగ్‌, ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనకు దక్కింది.

మెగసెసె

ఆసియా నోబెల్‌గా పేరున్న ఈ అవార్డ్‌ను ఫిలిప్పీన్స్‌ దేశం అందజేస్తుంది. ఈ ఏడాది విజేతలు..
గ్యారి బెంచ్‌గిబ్‌: ఇండోనేషియాకు చెందిన వ్యక్తి. ప్లాస్టిక్‌ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడారు.
బెర్నడెట్టే జే మాడ్రిడ్‌: ఫిలిప్పీన్స్‌ దేశానికి చెందిన మహిళ. బాలల హక్కుల కోసం పోరుడుతున్నారు.
తదాషి హట్టోరి: జపాన్‌ దేశస్తుడు. 15వ ఏట వైద్యుడు అయ్యాడు. చిన్న పిల్లల చూపునకు సంబంధించి ఆయన చేస్తున్న సేవకు అవార్డ్‌ లభించింది.
సొథెరా చిమ్‌: కంబోడియా దేశస్థుడు. మానసిక వైద్య సలహాదారుగా సేవలను అందిస్తున్నారు.
నోట్‌: కేరళ మాజీ మంత్రి శైలజకు కూడా మెగసెసె అవార్డును ప్రకటించారు. అయితే దీన్ని ఆమె తిరస్కరించారు.
పద్మ: 2022లో మొత్తం 128 మంది ఈ అవార్డ్‌ పొందారు. నలుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మ భూషణ్‌, 107 మంది పద్మశ్రీ అవార్డును పొందారు.
పద్మ విభూషణ్‌: బిపిన్‌ రావత్‌, కల్యాణ్‌సింగ్‌, రాధేశ్యామ్‌ ఖేమ్కా, ప్రభా ఆత్రే.
పద్మ భూషణ్‌: గులాం నబీ ఆజాద్‌, కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా, సుందర్‌ పిచాయ్‌, సైరస్‌ పూనవాలా, చంద్రశేఖరన్‌, దేవేంద్ర ఝఝరియ.
పద్మశ్రీ పొందిన తెలుగు వారు: గరికపాటి నరసింహారావు, గోసవీడు షేక్‌ హసన్‌, సుంకర వెంకట ఆదినారాయణ రావు, షావుకారు జానకి, దర్శనం మొగిలయ్య, పద్మజా రెడ్డి.

క్రీడా పురస్కారాలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్‌ 30న ఢిల్లీలో క్రీడా పురస్కారాలను అందజేశారు. తెలంగాణకు చెందిన నిఖత్‌ జరీన్‌ (బాక్సర్‌), ఆకుల శ్రీజ (టేబుల్‌ టెన్ని-స్‌) అర్జున అవార్డు అందుకున్నారు. అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న’ను తమిళనాడుకు చెందిన టీటీ (టేబుల్‌ టెన్నిస్‌) క్రీడాకారుడు ఆచంట శరత్‌ కమల్‌ (40) అందుకున్నాడు.
ద్రోణాచార్య: మహ్మద్‌ అలీ కమర్‌ (బాక్సింగ్‌), జీవన్‌జోత్‌ సింగ్‌ తేజ (ఆర్చరీ), సుజిత్‌ మాన్‌ (రెజ్లింగ్‌), సుమా షిరూర్‌ (పారా షూటింగ్‌)

ధ్యాచ్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌: సురేష్‌ (కబడ్డీ), అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్‌), ధరమ్‌వీర్‌ సింగ్‌ (హాకీ), బహదూర్‌ గురుంగ్‌ (పారా అథ్లెటిక్స్‌)

అర్జున: సాక్షి కుమారి (కబడ్డీ), దీప్‌ గ్రేస్‌ ఇక్కా (హాకీ), లక్ష్యసేన్‌ (బ్యాడ్మింటన్‌), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (బ్యాడ్మింటన్‌), తరుణ్‌ థిల్లాన్‌ (పారా బ్యాడ్మింటన్‌), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్‌), సీమా పునియా (అథ్లెటిక్స్‌), ఆల్డస్‌ పాల్‌ (అథ్లెటిక్స్‌), అవినాష్‌ సాబుల్‌ (అథ్లెటిక్స్‌), అమిత్‌ (బాక్సింగ్‌), సరిత (రెజ్లింగ్‌), అన్షు (రెజ్లింగ్‌), సుశీలా దేవి (జూడో), ఓం ప్రకాష్‌ మిథర్వాల్‌ (షూటింగ్‌), ఎలవెనిల్‌ వలరివాన్‌ (షూటింగ్‌), పర్వీన్‌ (వుషు), వికాస్‌ ఠాకూర్‌ (వెయిట్‌ లిఫ్టింగ్‌), స్వప్నిల్‌ పాటిల్‌ (పారా స్విమ్మింగ్‌), జెర్లిన్‌ అనికా జే (చెవిటి బ్యాడ్మింటన్‌), సాగర్‌ ఓవల్కర్‌ (మల్కాంబ్‌), నయన్‌ మోని సైకియా (లోన్‌ బాల్‌), భక్తి కులకర్ణి (చెస్‌), ఆర్‌ ప్రజ్ఞానంద (చెస్‌).

లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌: దినేష్‌ లాడ్‌ (క్రికెట్‌), బిమల్‌ ఘోష్‌ (ఫుట్‌బాల్‌), రాజ్‌ సింగ్‌ (రెజ్లింగ్‌).
డబ్ల్యూటీఏ

డబ్ల్యూటీఏ మహిళా టెన్నిస్‌ అవార్డులను డిసెంబర్‌ 12న ప్రకటించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2022’ అవార్డు పోలిష్‌ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్‌కు లభించింది. ఆమె ఈ అవార్డు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ‘డబుల్స్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన బార్బోరా క్రెజ్‌సికోవ-కాటెరీనా సినియాకోవ దక్కింది. ‘మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు బ్రెజిలియన్‌ క్రీడాకారిణి బీట్రిజ్‌ హద్దద్‌ మైయాకు లభించింది. డబ్ల్యూటీఏ అవార్డును గెలుచుకున్న మొదటి బ్రెలిజియన్‌ క్రీడాకారిణి ఈమె. ‘న్యూకమర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు చైనీస్‌ క్రీడాకారిణి జెంగ్‌ క్విన్వెన్‌కు దక్కింది. ‘కమ్‌బ్యాక్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు జర్మనీ క్రీడాకారిణి టట్జానా మారియాకు లభించింది. డబ్ల్యూటీ ప్లేయర్‌ అవార్డులను 1977లో ప్రవేశపెట్టారు.

ఇతర అవార్డులు

మధురాంతకం నరేంద్ర: ఈయన దేవదాసీల వ్యవస్థపై రాసిన పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ దక్కింది. మనోధర్మ పరాగం అనే పుస్తకాన్ని రచించారు.
వారాల ఆనంద్‌: ప్రకృతి వర్ణనలతో గుల్జార్‌ రచించిన గ్రీన్‌ పోయమ్స్‌ను ఆకుపచ్చ కవితలుగా అనువదించినందుకు అనువాద పురస్కారాన్ని వారాల ఆనంద్‌ గెలుచుకున్నారు.
ఆశా పరేఖ్‌: ఈ ఏడాది దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ లభించింది.
శరత్‌ కమల్‌ ఆచంట: ధ్యాన్‌చంద్‌ ఖేల్త్న్ర అవార్డును పొందారు. శరత్‌ కమల్‌ ఆచంట. ఆయన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు.
పూర్ణిమా దేవి: ఐక్యరాజ్య సమితి చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ అవార్డ్‌ లభించింది. ఈమె వన్యప్రాణి జీవ శాస్త్రవేత్త.
రామోజు హరగోపాల్‌: ఈ ఏడాది కాళోజీ నారాయణ రావు అవార్డ్‌ లభించింది. ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందినవారు.
అమ్మంగి వేణుగోపాల్‌: డాక్టర్‌ సి నారాయణ రెడ్డి పురస్కారం లభించింది.

మృతులు



సినీ రంగం

కృష్ణ: నవంబర్‌ 15వ తేదీన మృతి చెందారు. 350కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. 2009లో పద్మ భూషణ్‌ పొందారు. 1989లో కాంగ్రెస్‌ తరఫున ఏలూరు ఎంపీగా పోటీచేసి గెలిచారు. 2008లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందాడు. ఆయన తొలి చిత్రం తేనె మనసులు. తెలుగులో తొలి కౌబాయ్‌ చిత్రం, తొలి సినిమాస్కోప్‌ చిత్రం, తొలి ఈస్ట్‌మన్‌ కలర్‌ చిత్రం, తొలి 70 ఎంఎం చిత్రాలు ఆయన తెచ్చినవే.
కృష్ణంరాజు: సెప్టెంబర్‌ 11న మరణించారు. నంది అవార్డ్‌ను పొందిన తొలి నటుడు. వాజ్‌పేయి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
కైకాల సత్యనారాయణ: ఈయన ప్రముఖ తెలుగు నటుడు. డిసెంబర్‌ 23న మరణించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1996లో టీడీపీ తరఫున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.
లతా మంగేష్కర్‌: ఫిబ్రవరి 6న మరణించారు. నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా, క్వీన్‌ ఆఫ్‌ మెలోడీ అని ఆమెకు పేరుంది. 1969లో పద్మ భూషణ్‌, 1999లో పద్మ విభూషణ్‌, 1989లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌, 2001లో భారతరత్న పొందారు.
బప్పీలహరి: సినీ సంగీత దర్శకుడు. ఫిబ్రవరి 16న మరణించారు.
సిడ్నీ పాయిటిర్‌: జనవరి 6న మరణించారు. ఆస్కార్‌ అవార్డ్‌ను పొందిన తొలి నల్ల జాతీయుడు.
ప్రముఖ రాజకీయ నాయకులు
ములాయం సింగ్‌ యాదవ్‌: ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అక్టోబర్‌ 10న మరణించారు.
సుఖ్‌రామ్‌: మే 11న మరణించారు. 1993-96 మధ్య కాలంలో స్వతంత్ర హోదాలో కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు.
చందుపట్ల జంగారెడ్డి: ఫిబ్రవరి 5న మరణించారు. 1984లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఇద్దరిలో ఈయన ఒకరు. పీవీ నరసింహారావును ఓడించి ఆయన లోక్‌సభలో అడుగుపెట్టారు.
సామాజిక-హక్కుల కార్యకర్తలు
ఇలా భట్‌: నవంబర్‌ 2న మరణించారు. మహిళల హక్కుల ఉద్యమకారిణి. ఆమె సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకురాలు. పద్మ భూషణ్‌ పొందారు.
సింధుతాయ్‌ సప్కల్‌: జనవరి 4న మరణించారు. 2021లో పద్మశ్రీ పొందారు.
శాంతి దేవి: సామాజిక సేవ కార్యకర్త, పద్మశ్రీ అవార్డ్‌ గ్రహీత. జనవరి 16న మరణించారు. ఆమెకు లుగ్డిదేవి అని కూడా పేరు ఉంది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు.

ఇతరులు

శ్యామ్‌ శరణ్‌ నేగి: భారత్‌లో తొలి ఓటర్‌గా గుర్తింపు పొందారు. మొత్తం 34 సార్లు ఓటు వేశారు. నవంబర్‌ 5న మరణించారు.

జయంతి పట్నాయక్‌: సెప్టెంబర్‌ 29న మరణించారు. జాతీయ మహిళా కమిషన్‌కు తొలి అధ్యక్షురాలిగా పనిచేశారు.

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా: స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం. ఆగస్ట్‌ 14న మరణించారు.
అభిజిత్‌ సేన్‌: ప్రముఖ ఆర్థిక వేత్త. ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆగస్ట్‌ 30న మరణించారు.
సైరస్‌ మిస్త్రీ: రోడ్డు ప్రమాదంలో సెప్టెంబర్‌ 4న మరణించారు. కొంత కాలం ఆయన టాటా సంస్థకు చైర్మన్‌గా పనిచేశారు.
తెలుగు ప్రముఖులు
ఎల్లంకి భాస్కర నాయుడు: ప్రముఖ తెలుగు వికీపీడియన్‌. సెప్టెంబర్‌ 10న మరణించారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత 2011 నుంచి వికీపీడియాలో రచనలు చేశారు.
దుర్గాదేవి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ఐద్వా సీనియర్‌ నాయకురాలు. ఏప్రిల్‌ 19న మరణించారు.
మల్లు స్వరాజ్యం: మార్చి 19న మరణించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో జన్మించారు. 1945-46 మధ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు.
ముదిరెడ్డి లింగారెడ్డి: జనవరి 31న మరణించారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు.
భరత్‌ భూషణ్‌: తెలంగాణ సాంస్కృతి, భౌగోళిక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌. జనవరి 30న మరణించారు.

వి. రాజేంద్ర శర్మ ,ఫ్యాకల్టీ 21 సెంచరీ ఐఏఎస్‌, అకాడమీ: 9849212411

1 comment:

Job Alerts and Study Materials