ఇండియా పోస్ట్ అతి పెద్ద నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియా పోస్ట్ అతి పెద్ద నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద.. భారత పోస్ట్‌లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు.
ఈ 40,889 ఖాళీలకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి మీరు ఈ వెబ్‌సైట్‌ను indiapostgdsonline.gov.in సందర్శించవచ్చు. ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2023 కింద ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తులు ఈరోజు అంటే 27 జనవరి 2023, శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి.
నేటి నుండి ప్రారంభమైన ఈ దరఖాస్తులు 16 ఫిబ్రవరి 2023 వరకు అందుబాటులో ఉంటాయి. అంటే.. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16. ఈ అప్లికేషన్‌ల ఎండిట్ ఆప్షన్ ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 19, 2023 వరకు ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతిలో గణితం, ఆంగ్లం తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి సెకండరీ తరగతి వరకు స్థానిక భాషను అభ్యసించి ఉండటం కూడా అవసరం.
వయోపరిమితి విషయానికొస్తే.. ఈ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీకి వయో సడలింపు ఉంటుంది. ఈ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక మెరిట్ ద్వారా జరుగుతుంది.
10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల మెరిట్‌ను తయారు చేసి ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయి. ఇతర మార్గాల ద్వారా చేసిన దరఖాస్తు అంగీకరించబడదు.
ఈ పోస్టుల కోసం ఎంపిక చేసిన తుది జాబితా 30 జూన్ 2023 నాటికి విడుదల చేయబడుతుంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ లో 2480, తెలంగాణ పోస్టల్ లో 1266 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్ , ఆన్ లైన్ అప్లికేషన్ల కొరకు https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.
9133627421
ReplyDelete