Mother Tongue

Read it Mother Tongue

Thursday, 19 January 2023

బీటెక్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు.. రూ.72,850 వరకూ జీతం

TS High Court Recruitment 2023 : తెలంగాణ హైకోర్టు సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 45 సిస్టమ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. వివరాల్లోకెళ్తే..

ప్రధానాంశాలు:

  • టీఎస్‌ హైకోర్ట్‌ రిక్రూట్‌మెంట్‌ 2023
  • 45 సిస్టమ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ
  • జనవరి 21 దరఖాస్తులకు చివరితేది
బీటెక్‌ పూర్తిచేసిన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. తెలంగాణ హైకోర్టు సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 45 సిస్టమ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్(నం.08/2023) జారీ చేసింది. వివరాల్లోకెళ్తే..
ముఖ్య సమాచారం:
  • ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
  • అర్హతలు: పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55% మార్కులతో బీఈ, బీటెక్‌ (సీఎస్‌ఈ/ ఐటీ/ ఈసీఈ)/ డిప్లొమా(ఎలక్ట్రానిక్స్), బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ ఐటీ)లో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌పై పరిజ్ఞానం ఉండాలి.
  • వయసు: అభ్యర్థుల వయసు 11-01-2023 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్‌/ బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఎంపిక విధానం: అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సీబీటీ పరీక్ష (90 మార్కులు), ఇంటర్వ్యూ (10 మార్కులు), రూల్ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 చెల్లిస్తారు.
  • పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)లో 90 (కంప్యూటర్‌ నాలెడ్జ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌) ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
  • పరీక్ష ఫీజు: ఓసీ/బీసీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 600, ఎస్సీ.. ఎస్టీ అభ్యర్థులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తులు ప్రారంభం: జనవరి 21, 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
  • దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 11, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • హాల్‌టికెట్లు విడుదల: కంప్యూటర్‌ బేస్‌డ్‌ హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ను ఫిబ్రవరి 20, 2023 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • పరీక్ష తేదీ: పరీక్షను మార్చి 2023లో నిర్వహిస్తారు.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://tshc.gov.in/getRecruitDetails 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials