Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 17 January 2023

TSPSC Group 2 : రేపటి నుంచి తెలంగాణ గ్రూప్‌ 2 అప్లికేషన్‌ ప్రాసెస్‌ ప్రారంభం.. విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలివే

 TSPSC Group 2 : టీఎస్‌పీఎస్సీ జ‌న‌వ‌రి 18వ తేదీ నుంచి తెలంగాణ గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించనుంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 16 వరకు గడువు ఉంటుంది. పూర్తి వివరాల్లోకెళ్తే...

ప్రధానాంశాలు:

  • టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌
  • 783 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులకు ఛాన్స్‌
TSPSC Group 2 Recruitment 2023 : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 783 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జ‌న‌వ‌రి 18వ తేదీ నుంచి ఈ గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించనుంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 16 వరకు గడువు ఉంటుంది. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీస్‌, వైద్యారోగ్యశాఖతో పాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ తదితర పోస్టులకు నోటిఫికేషన్లు విడ‌ద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఇందులో పోలీస్‌, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

TSPSC Group 2 పోస్టుల వివ‌రాలు ఇవే:
  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3 - 11
  • అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్ - 59
  • డిప్యూటీ తహసీల్దార్‌ (నాయిబ్‌ తహసీల్దార్‌) - 98
  • సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2 - 14
  • అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌) - 63
  • అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్ - 09
  • ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (మండల పంచాయతీ అధికారి) - 126
  • ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్ - 97
  • అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌) - 38
  • అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(జనరవ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) - 165
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ - 15
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ - 25
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్ మెంట్ - 07
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ - 02
  • డ్రిస్టిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ (జువైనల్‌ కరెక్షనల్‌ సర్వీస్‌) - 11
  • అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (బీసీ వెల్ఫేర్‌ సబ్‌ సర్వీస్‌) - 17
  • అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబ్‌ సర్వీస్‌) - 09
  • అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (ఎస్సీడీడీ సబ్‌ సర్వీస్‌) - 17
అర్హతలు:
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ నంబర్ 13 అనగా.. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్ మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీటిలో 07 పోస్టులు ఉన్నాయి.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials