Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 18 January 2023

ఏపీ పోలీస్ ఉద్యోగాలు.. రేపటితో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ..

Police Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 411ఎస్సై, 6100 కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 411ఎస్సై, 6100 కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక ఎస్సై పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 12, 2022న ప్రారంభం అయ్యాయి. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 18, 2023. అంటే రేపటితో ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. దరఖాస్తులు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://slprb.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలిలా..

 సివిల్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు (మెన్ అండ్ ఉమెన్) - 315

ఏపీఎస్పీ రిజర్వ్ ఎస్సై పోస్టులు - 96

మొత్తం ఎస్సై పోస్టుల సంఖ్య - 411.

ముఖ్యమైన తేదీలు..

ఎస్సై పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం - డిసెంబర్ 12, 2022

ఎస్సై పోస్టులకు దరఖాస్తుల చివరి తేదీ - జనవరి 18, 2023

ప్రిలిమినరీ పరీక్ష తేదీలు..

ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష - ఫిబ్రవరి 19, 2023

ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్స్ విడుదల తేదీ - ఫిబ్రవరి 02, 2023

(పేపర్ 1 ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు..

పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు )

ఎస్సై పరీక్ష మొదటి పేపర్ లో రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.

సెకండ్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ లో జనరల్ స్టడీస్ పేపర్ 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ- జనవరి 22, 2023 న నిర్వహించనున్న విషయం తెలిసిందే.

కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు కలిగి ఉన్న పరీక్ష. దీనిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials