ఆపరేషన్ పోలో (1948 సెప్టెంబర్ 13-17) : యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నిజాంను లొంగదీయడం ఒకటే మార్గమని భారత్ భావించింది. హైదరాబాద్ రాజ్య విలీనంను ఆపుటకు నిజాం అనేక చర్యలు చేపట్టాడు.
1. వివిధ దేశాల మద్దతు కోరుతూ నిజాం లేఖలు : బ్రిటీషు చక్రవర్తి – 6వ జార్జి గారికి. బ్రిటన్ ప్రధానమంత్రి – క్లెమెంట్ అట్లీకి. బ్రిటన్ ప్రతిపక్ష నాయకుడు – విస్టన్ చర్చిల్ గారికి. అమెరికా అధ్యక్షుడు – ట్రూమన్ గారికి. నిజాం వ్యక్తిగతంగా లేఖలు రాసిసహాయం అభ్యర్థించాడు. కానీ వారు తమఆశక్తతను వ్యక్తపరిచారు.
2. ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు : 1948 ఆగస్టు 21న హైదరాబాద్ ప్రతినిధి మొయిన నవాజ్ జంగ్ భారతదేశంపై ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ ప్రభుత్వంకు యు.ఎన్.ఓలో సహకరించడానికి నియమించుకున్న సలహాదారు – సర్ వాల్టర్ మాంక్టన్. హైదరాబాద్ విషయము 1948 సెప్టెంబర్ 17న భద్రతామండలిలో చర్చకు వస్తుందని యు.ఎస్. ప్రకటించింది. ఈ ఫిర్యాదుతో సెప్టెంబర్ 13న భారత యూనియన్ సైన్యాలు హైదరాబాద్ రాజ్యం పై నలు దిక్కుల నుండి దాడి మొదలు పెట్టింది. హైదరాబాద్ పై పోలీస్ చర్యకు నేతృత్వం వహించినది – లెఫ్టినెంట్ జనరల్ మహారాజ్ సింగ్ షోలాపూర్ నుండి మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి, విజయవాడ నుండి మేజర్ జనరల్ రుద్ర నేతృత్వంలో యూనియన్ సైన్యాలు దాడిని ముమ్మరం చేశాయి. తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించిన భారత సైన్యాలకు సంతోషంతో ప్రజలు ఘనస్వాగతం పలికారు. దీనితో కేవలం 4 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నగరంలోకి మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలోని సేనలు ప్రవేశించాయి. సెప్టెంబర్ 17న లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసి ప్రభుత్వ పగ్గాలను నిజాంకు అప్పగించింది. సెప్టెంబర్ 17 సాయంత్రం నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన అధికార రేడియో దక్కలో లొంగిపోతున్నట్లు ప్రకటించారు. దానితో పాటు జైల్లో ఉన్న స్వామి రామానంద తీర్థను విడుదల చేయవలసిందని ఆజ్ఞాపించాడు. 1948 సెప్టెంబర్ 18న నిజాం సైన్యాధిపతి జనరల్ ఎల్ డ్రూస్ మేజర్ జనరల్ చౌదరి ముందు లొంగిపోయాడు. మిలిటరీ నియమాల ప్రకారం హైదరాబాదు మొదట చేరుకున్న మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి పాలనా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ జె.ఎన్.చౌదరి హైదరాబాద్ రాజ్యంపై మిలిటరీ గవర్నర్ గా నియమితుడైనప్పటికీ చట్టరిత్యా రాజ్యా ధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొనసాగాడు. 1948 సెప్టెంబర్ 22 న భారత్ పై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు నిజాం కేబుల్ ద్వారా భద్రతా మండలికి తెలియజేశారు. ఈ చర్యకు “పోలీసు యాక్షన్” అని పేరు సూచించిన వ్యక్తి – రాజాజీ. భారత గవర్నర్ జనరల్ – సి.రాజగోపాలాచారి. భారత సైన్యాధిపతి – జనరల్ బుచర్. ఈ పోలీసు యాక్షన్ సమయంలో భారత రక్షణ మంత్రి – బల్దేవ్ సింగ్. సెప్టెంబర్ 17న మహారాష్ట్రలో మరఠ్వాడ సంగ్రామ్ ముక్తి దివస్ పేరుతో కర్నాటకలో హైదరాబాద్ – కర్నాటక విభజన దినం పేరుతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి జాతీయ జెండా ఎగరవేస్తున్నాయి. ఈ సందర్భంగా భారతదేశ కడుపులో ఏర్పడ్డ పుండుతొలగిపోయిందని పేర్కొన్న నాయకుడు – పటేల్ 1948 సెప్టెంబర్ 18న నిజాం, జనరల్ చౌదరిని కలిసి లాంచనంగా అధికారం అప్పగించారు. 1948 సెప్టెంబర్ 18న ప్రధానమంత్రి లాయక్ అలీ, సైన్యాధికారి జనరల్ ఇద్రూస్ లను యూనియన్ సైన్యం గృహనిర్బంధం చేసింది. రజాకార్ నాయకుడు కాశీం రజ్వీని బొల్లారం లోని సైనిక కారాగారంలో నిర్బంధించింది. 1948 సెప్టెంబర్ 22న నిజాం ఉస్మాన్ అలీఖాన్ యు.ఎన్.ఓ.కు తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించు కున్నాడు. ఈ పోలీస్ చర్య అనంతరం హైద్రాబాద్ సంస్థానానికి వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేలను బేగంపేట విమానాశ్రయం వద్ద నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వయంగా స్వాగతం పలికాడు. మిలటరీ మరియు వెల్లోడి పాలన. గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి. మిలటరీ గవర్నర్ – జె. ఎస్. చౌదరి. చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ – డి.ఎస్. బాకే (దత్త ప్రసన్న సదాశివ బాక్లే). అడిషినల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ – డి.ఆర్. ప్రధాన్. ఇతర సభ్యులు- 1) నవాబ్ జైన్ యార్‌జంగ్ బహదూర్ 2) రాజా దొందిరాజ్ బహదూర్ 3) సి.వి.ఎస్.రావు 4) సి. హెచ్. కృష్ణారావు. కాని పాలన మొత్తం హిస్ ఎక్జాల్ట్ హైనస్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదనే జరిగేది. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1950 జనవరి 26 నుండి మాత్రమే రాజ్ ప్రముఖ్ గా నియమించబడ్డాడు. ఇతను (చౌదరీ) చేసిన మొదటి సంస్కరణలలో ముఖ్యమైనది 1949 ఫిబ్రవరి 6 న విడుదల చేసిన ఫర్మానా. ఈ ఫర్మానా ప్రకారం, నిజాం సొంత ఆస్తి సర్ఫేఖాస్ ను రద్దు చేశారు. నిజాం కరెన్సీ (హెలిసిక్కా, రద్దయింది.ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా శుక్రవారంను రద్దుచేసి ఆదివారంను సెలవుదినంగా ప్రకటించారు. ఈ విధంగా నిజాం సర్ఫేఖాస్ ఆస్తిని స్వాధీనం చేసుకొని నిజాంకు నష్టపరిహారంగా 3 కోట్ల రూపాయలు చెల్లించారు. అందువలనే భారతదేశంలో ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్న నగరం హైదరాబాద్ అయింది.
ముస్లింలపై దాడులు : ఇతని పాలనాకాలంలోనే పెద్దమొత్తంలో ముస్లింలపై దాడులు జరిగాయి. ప్రముఖ జర్నలిస్ట్ యూనస్ సలీమ్ ఈ దురాగతాలను నెహ్రూ దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో ఈ దాడులపై భారత ప్రభుత్వం నియమించిన కమిటీ – పండిట్ సుందర్‌లాల్ కమిటీ.
పండిట్ సుందర్‌లాల్ కమిటీ : కమిటీ ఛైర్మన్ – పండిట్ సుందర్‌లాల్. సభ్యులు – 1) ఖాజీ అబ్దుల్ గఫర్ 2) మౌలానా అబ్దుల్ మిస్త్రి కార్యదర్శులు – 1) ఫరూఖ్ సియార్ 2) పి.పి. అంబుల్కర్ – ఈ కమిటీ 1949 నవంబర్ 29న హైద్రాబాద్ రాజ్యంను సందర్శించింది. ఈ కమిటీ డిసెంబర్ 21, 1949 న ఢిల్లీకి చేరుకొని కేంద్రప్రభుత్వంనకు నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో పేర్కొన్న విషయాలు. ఈ మరణాలలో అధికంగా రజాకార్లు బలంగా ఉన్న ఉస్మానాబాద్, గుల్బర్గా, బీదర్, నాందేడ్ లో దాదాపు 18,000 మంది వరకు మరణించారు. ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వంనకు సమర్పించడంతో కేంద్ర ప్రభుత్వం జనరల్ జె.ఎన్.చౌదరిను తొలగించి అతని సానంలో మ్.కె.వెల్లోడి నేతృత్వంలో పౌర పాలనను ఏర్పాటుచేసింది. ఈ నివేదికను ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. ప్రస్తుతం ఈ నివేదికను ఢిల్లీలోని నెహ్రూ మెమొరియల్ మ్యూజియం, లైబ్రరీలో ఉన్నది.
ఎమ్.కె.వెల్లోడి పాలన :
హైదరాబాద్ రాష్ట్రంలో ఆధునీకరణ పాలన అనే పేరుతో ఉర్దూ స్థానంలో ఇంగ్లీషును చేర్చారు. వెల్లోడి ప్రభుత్వం 1949 ముల్కి చట్టంలోని ముల్కీ అనగా… పుట్టుకతో వ్యక్తి స్థానికుడై ఉండాలి, ఆ వ్యక్తి జన్మించిన నాటికి అతని తండ్రి 15 సం..ల ప్రభుత్వ సర్వీసు పూర్తి చేసి వుండాలి అనే నియమాలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదని పేర్కొని పెద్ద సంఖ్యలో నాన్ ముల్కీలను ఉద్యోగాలలో నియమించింది. ఈ అధికారులు హైదరాబాద్ రాజ్యంలో పెద్దమొత్తంలో లంచగొండి తనానికి అలవాటు పడ్డారు. ఈ చాల విషయాన్ని పద్మజా నాయుడు పార్లమెంట్ లో ప్రస్తావించారు. 1950, జనవరి 25న భారత ప్రభుత్వానికి, నిజాం రాజుకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ రాష్ట్రానికి నిజాంను రాజప్రముఖ్ గా నియమించడం జరిగింది. తేకాకుండా నిజాంకు సంవత్సరానికి 1.25 కోట్ల రాజభరణం జీవితాంతం చెల్లించడానికి భారత ప్రభుత్వం ఒప్పుకుంది. నిజాం ప్రభువు 1950, జనవరి 26 నుండి 1956, నవంబర్ 1 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్రానికి రాజప్రముఖ్ గా వ్యవహరించాడు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ప్రభుత్వం నిజాం పేరు మీదుగా పరిపాలన కొనసాగించింది. 1952 వ సంవత్సరం నాటికి ఎంప్లాయిమెంట్ ఆఫీస్ లెక్కల ప్రకారం హైదరాబాద్ రాజ్యంలో దాదాపు 70,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. వెల్లోడి ప్రభుత్వంలోని మంత్రివర్గం : యం. శేషాద్రి – హెూం, సమాచార, న్యాయ, ఎన్నికలు. సి.వి.యస్. రావు – ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమలు. బూర్గుల రామకృష్ణారావు – విద్య, ఎక్సైజ్, రెవెన్యూ శాఖలు. వి.బి. రాజు – కార్మిక, కస్టమ్స్ శాఖలు. నవాబ్ జైన్ యార్‌జంగ్ – పబ్లిక్ వర్క్స్ శాఖ. పూల్‌చంద్ గాంధీ – వైద్యం, ఆరోగ్యం , స్థానిక సంస్థలు. వినాయక్ రావ్ విద్యాలంకర్ – వ్యవసాయం, పశువైద్యం, సహకారం, సప్లై శాఖలు. మిలటరీపాలన – వెల్లోడి ఉద్యోగ విధానాలు : స్వాతంత్ర్యానంతరం హైదరాబాద్ ప్రభుత్వం ఎం.ఎ.రహమాన్ అనే పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిని నియమించి, ఉద్యోగులను భర్తీ చేసింది. ఈ ప్రభుత్వంలోని కొన్ని దిగువస్థాయి, మధ్యస్థాయి ఉద్యోగాలలో నియమాకాలు చేపట్టడానికి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి లను హైదరాబాద్, వరంగల్, ఔరంగాబాద్ లో ఏర్పాటు చేసింది. వీటిలో ఒకటి హైదరాబాద్ లోను, రెండవది వరంగల్ లో, మూడోది ఔరంగాబాద్లో ఉండేవి. ఈ ప్రాంతీయ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ లు ప్రభుత్వ శాఖలలో, ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు నియమాకాలుచేసేవి నైపుణ్యం గల కార్మికులకు, సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇవ్వడానికి ‘బికనూరు శిక్షణ కేంద్రం’ ఏర్పరచారు
ఇతర విషయాలు
1926లో గోగినేని రంగనాయకులు ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ విలేజెస్లేనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకం యొక్క ద్వితీయ భాగాన్ని 1929లో కాలానైజేషన్ పాలసీ ఆఫ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ పేరుతో విడుదలచేశారు. ఈ పుస్తకంలో భాగంగా హైదరాబాద్ రాజ్యంలో అనుకూలంగా ఉన్న కొన్ని లక్షల ఎకరాల భూమి గురించి పేర్కొనడం జరిగింది.
భూదానోద్యమం
1951లో గాంధీజీ సిద్ధాంతాలు వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో అఖిల భారత సర్వోదయ సమ్మేళనం శివరాంపల్లిలో జరిగింది. ఈ సమ్మేళన అనంతరం ఆచార్య వినోభాబావే శివరాంపల్లి నుండి పోచంపల్లికి వెళ్ళాడు.
వినోభాభావే మొదటి భూదాన యాత్ర : ఆచార్య వినోభాబావే నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో 1951 ఏప్రిల్ 18న భూధాన ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ పాదయాత్రకు కోదండరామిరెడ్డి ఇన్ ఛార్జిగా ఉన్నారు. పోచంపల్లి గ్రామ పెద్ద వెదిరె రామచంద్రారెడ్డి తన తండ్రిగారి పేరున ఉన్న 100 ఎకరాల భూమిని భూదాన యజ్ఞానికి దానం చేశాడని కోదండరామిరెడ్డి గారు తన ఆత్మకథ అయిన నిన్నటి ఇతిహాసంలో పేర్కొన్నాడు. వినోభాబావే దాతలను తమ ఆస్తిలో కనీసం ఆరోభాగం (1/6)వ వంతు భూమిని దరిద్రనారాయణులకు అర్పించమని వేడుకునేవాడు. సూర్యాపేటలో కేతిరెడ్డి కోదండరామిరెడ్డి ఆయన సోదరుడు కేతిరెడ్డి పురుషోత్తమరెడ్డి తమ ఆస్తిలో నాలుగో భాగం భూదానం చేశాడు.
వినోభాభావే రెండో భూదాన యాత్ర : వినోభాబావే రెండవ భూదాన యాత్రను 1955 డిశంబర్ లో ఖమ్మం జిల్లాలోని ఎర్రపాలెం నుండి ప్రారంభించాడు. తెలంగాణలో భూదానోద్యమం ప్రారంభమై 25 సం..లు ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకొని భూధాన యజ్ఞమండలి ఉపాధ్యక్షుడు మాణిక్యరావు నాయకత్వంలో రజతోత్సవ పాదయాత్రను 1970 ఏప్రిల్ 18వ తేదీన హైదరాబాద్ లో అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ భూదాన జ్యోతిని వెలిగించి ప్రారంభించాడు.
జయప్రకాశ్ నారాయణ భూధానోద్యమం : 1952లో జయప్రకాశ్ నారాయణ, ఆయన సతీమణి శ్రీమతి ప్రభావతీ దేవి మహబూబ్ నగర్ జిల్లాలో భూధాన పర్యటన చేశారు. ఈ పర్యటనకు కూడా శ్రీ కేతిరెడ్డి కోదండరామిరెడ్డి ఇంచార్జ్ గా వ్యవహరించాడు
No comments:
Post a Comment