Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 10 January 2023

TSPSC CDPO Key Released: సీడీపీఓ ప్రాథమిక కీ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ.. మార్కులు తెలుసుకోండిలా..

తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో మొత్తం 23 ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 5న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 10 వరకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 03, 2023న ఈ పరీక్ష నిర్వహించారు. 

మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి సీడీపీఓ (CDPO) పరీక్షను జనవరి 03, 2023న ఆన్ లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. శిశు సంక్షేమాధికారుల పోస్టులు 23 ఉండగా.. దీనికి 19,184 మంది దరఖాస్తు(Application) చేసుకున్నారు. మొత్తం ఈ పరీక్షకు 14వేలకు పైగా హాజరయ్యారు.   కంప్యూటర్ బేస్డ్ విధానంలో సీడీపీఓ పరీక్ష రాసిన అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్ అనేది జనవరి 10, 2023 ఉదయం 10 గంటల నుంచి వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ మార్కులను చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ ఈ లింక్ పై క్లిక్ చేయండి.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials