CDOT
395 Project Engineer Posts : ఈ నోటిఫికేషన్ ద్వారా బెంగళూరు, ఢిల్లీలలో
పనిచేయుటకు.. ఏడాది కాలం పాటు ఒప్పంద ప్రాతిపదికన 395 ప్రాజెక్ట్
ఇంజినీర్ (4G/5G Project) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి
అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రధానాంశాలు:
- సీడాట్ రిక్రూట్‌మెంట్ 2023
- 395 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ
- ఫిబ్రవరి 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి
CDOT Recruitment 2023 : భారత
ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్
డెవలస్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ
నోటిఫికేషన్ ద్వారా బెంగళూరు, ఢిల్లీలలో పనిచేయుటకు.. ఏడాది కాలం పాటు
ఒప్పంద ప్రాతిపదికన 395 ప్రాజెక్ట్ ఇంజినీర్ (4G/5G Project) పోస్టులను
భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు
కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే
అభ్యర్ధులు పదో తరగతి, ఇంటర్మీడియట్‌తోపాటు బీఈ/బీటెక్ లేదా తత్సమాన
కోర్సులో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత
పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లకు మించకుండా
ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 6, 2023లోపు
రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విద్యార్హతలు, వయసు, అకడమిక్ మెరిట్, అనుభవం
ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,00,000ల వరకు
జీతంగా చెల్లిస్తారు. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు.
No comments:
Post a Comment