తెలంగాణలో ఇటీవల వరుస నోటిఫికేషన్లు
విడుదల అయ్యాయి. దీనిలో భాగంగానే ప్రస్తుతం టీఎస్పీఎస్సీ గత వారం రోజుల
నుంచి విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్ష తేదీలను
ప్రకటిస్తోంది. ఇటీవల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష
తేదీని ఏప్రిల్ 24న నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. దీనిలో భాగంగానే
ప్రస్తుతం టీఎస్పీఎస్సీ గత వారం రోజుల నుంచి విడుదల చేసిన నోటిఫికేషన్లకు
సంబంధించి పరీక్ష తేదీలను ప్రకటిస్తోంది.
ఇటీవల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీని ఏప్రిల్ 24న,
డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి మే 07, పాలిటెక్నిక్ లెక్చరర్
ఉద్యోగాలకు సంబంధించి మే 13న, ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి
పరీక్ష తేదీ మే 17, లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి ఉద్యోగాలకు మే 17న
పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే నేడు తాజాగా జూన్ 05 నుంచి జూన్ 12వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్
పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా.. డిగ్రీ కాలేజ్
లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 31 న నోటిఫికేషన్ విడుదల
కావాల్సింది.. కానీ దీనిని ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా వేశారు.
అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో
ముగియాల్సి ఉండగా.. దీనిని ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. ఇక తాజాగా మరో
నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు.
ఇటీవల గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్(Ground Water Department) నుంచి
గెజిటెడ్, నాన్ గెజిటెడ్ వంటి పోస్టులు విడుదల అయిన విషయం తెలిసిందే.
దీనిలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ కు సంబంధించి గెజిటెడ్ నోటిఫికేషన్
ద్వారా మొత్తం 32 పోస్టులను భర్తీ చేస్తారు
అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 01, అసిస్టెంట్ కెమిస్ట్ - 04, అసిస్టెంట్
జియోఫిజిస్ట్ - 06, అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ - 16, అసిస్టెంట్
హైడ్రాలజిస్ట్ - 05 వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. డిసెంబర్ 06, 2022
నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. డిసెంబర్ 27 వరకు వీటి
దరఖాస్తులను స్వీకరించారు.
అయితే ఈ పోస్టులకు సంబంధించి తాజాగా ఎడిట్ ఆప్షన్ ను ఇచ్చారు. రేపటి నుంచి
మూడు రోజుల వరకు ఎడిట్ కు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి
టీఎస్పీఎస్సీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఫిబ్రవరి 01 ఉదయం 10 గంటల నుంచి
ఫిబ్రవరి 03 సాయంత్రం 05 గంటల వరకు ఎడిట్ విండో ఓపెన్ అయి ఉంటుందని
పేర్కొన్నారు. తప్పులు లేకుండా.. దరఖాస్తులను సవరించుకోవాలని అభ్యర్థులకు
సూచించింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు.
No comments:
Post a Comment