TSPSC Alert: ఇటీవల టీఎస్పీఎస్సీ నుంచి జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(JL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జేఎల్ పోస్టుల నోటిఫికేషన్ వెలువడలేదు.
ఇటీవల టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(JL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జేఎల్ పోస్టుల నోటిఫికేషన్ వెలువడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో నోటిఫికేషన్ జారీ చేశారు. తర్వత అనేక కారణాల వల్ల ఈ పోస్టులను 2012లో భర్తీ చేశారు. తెలంగాణ ప్రాంతంలో సుమారు 457 జేఎల్ పోస్టులను భర్తీ చేయగలిగారు. ఆ తర్వాత మళ్లీ జేఎల్ పోస్టుల భర్తీ జరగలేదు. అంటే దాదాపు 10 ఏళ్ల వరకు ఎలాంటి పోస్టులను భర్తీ చేయలేదు. 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. నేటికి ఈ పోస్టులకు మొత్తం 80 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపటితో జేఎల్ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుండగా.. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఇంకా ఎవరైనా దరఖాస్తులు సమర్పించని అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. దీనికి సంబంధించి పరీక్షను జూన్ లేదా జులై 2023లో నిర్వహించనున్నారు. 27 సబ్జెక్టుల్లో.. మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు.
No comments:
Post a Comment