Mother Tongue

Read it Mother Tongue

Saturday, 28 January 2023

ఏపీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడో తెలుసుకోండి..!

ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష ఫలితాలు జనవరి 27న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు APPSC ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 6,455 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వీరికి ఏప్రిల్ 23 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు APPSC ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా తేదీల్లో ఉదయం సెషన్లలోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు APPSC కమిషన్ స్పష్టం చేసింది.

APPSC Group 1 మెయిన్స్‌ షెడ్యూల్‌ ఇదే:
మెయిన్ పరీక్షలో మొత్తం 5 పేపర్లు ఉంటాయి. మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఒక్కో పేపరుకు 150 మార్కుల కేటాయించారు. మొత్తం 5 పేపర్లకు గాను 750 మార్కులు, పర్సనాలిటీ టెస్టుకు 75 మార్కులు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలను కేవలం అర్హత పరీక్షలుగానే పరిగణిస్తారు. వీటిమార్కులను మెయిన్స్ పరీక్ష మార్కుల్లో కలపరు.

  • ఏప్రిల్ 23: తెలుగు పేపర్ (అర్హత పరీక్ష మాత్రమే): 150 మార్కులు
  • ఏప్రిల్ 24: ఇంగ్లిష్ పేపర్ (అర్హత పరీక్ష మాత్రమే): 150 మార్కులు
  • ఏప్రిల్ 25: పేపర్-1 జనరల్ ఎస్సే (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన సమస్యలు: 150 మార్కులు
  • ఏప్రిల్ 26: పేపర్-2 (హిస్టరీ & కల్చరల్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా & ఏపీ): 150 మార్కులు
  • ఏప్రిల్ 27: పేపర్-3 (పాలిటీ, రాజ్యాంగం, గవర్నెన్స్, లా అండ్‌ ఎథిక్స్): 150 మార్కులు.
  • ఏప్రిల్ 28: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా అండ్‌ ఏపీ): 150 మార్కులు
  • ఏప్రిల్ 29: పేపర్-5 (సైన్స్ అండ్‌ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు

No comments:

Post a Comment

Job Alerts and Study Materials