Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 25 January 2023

AP CETs 2023 : ఏపీ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ తేదీలు విడుదల.. EAMCET ICET PGECET PGCET Ed CET పరీక్ష తేదీలివే.. చెక్‌ చేసుకోండి

AP Entrance Exam Dates 2023 : రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఇతర ప్రవేశపరీక్షల షెడ్యూళ్లను కూడా ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీసెట్, ఆర్‌సెట్ల షెడ్యూల్‌ విడుదల చేసింది.

AP EAMCET EAPCET 2023 : రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP EAPCET 2023)ను మే 15 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి సోమ­వారం షెడ్యూల్‌ విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే.. ఈఏపీసెట్‌లో భాగంగా మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఇక మే 23, 24, 25 తేదీల్లో బైపీసీ విభాగం ప్రవేశపరీక్షలు ఉంటాయి. ఈసారి ఈఏపీసెట్‌ పరీక్షలను గతేడాది కంటే రెండు నెలలు ముందుగా అంటే మే 15 నుంచే ప్రారంభించనుండడం విశేషం. దీనివల్ల జూన్‌ ఆఖరుకల్లా అడ్మిషన్లతో సహా మొత్తం పక్రియ పూర్తవుతుంది. దీంతో జూలై నుంచే తరగతులు ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.

రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఇతర ప్రవేశపరీక్షల షెడ్యూళ్లను కూడా ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీసెట్, ఆర్‌సెట్లను గతంలో కన్నా ముందుగా నిర్వహించి.. త్వరగా ప్రవేశాలు పూర్తి చేసేలా షెడ్యూళ్లను రూపొందించింది. 2023–24 విద్యాసంవత్సరానికి ప్రవేశ పరీక్షలను గతంతో పోలిస్తే చాలా ముందుగానే పూర్తి చేసేలా వివిధ సెట్ల షెడ్యూళ్లను రూపొందించింది.

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌- తేదీలు ఇవే

  • ఈసెట్‌ - మే 5
  • లాసెట్‌ - మే 20
  • ఎడ్‌సెట్‌ - మే 20
  • ఐసెట్‌ - మే 25, 26
  • పీజీఈసెట్‌ - మే 28 - 30
  • పీజీసెట్‌ - జూన్‌ 6 - 10
  • ఆర్‌సెట్‌ - జూన్‌ 12- 14

No comments:

Post a Comment

Job Alerts and Study Materials