Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 31 January 2023

నిరుద్యోగులకు అలర్ట్.. ఆ రెండు నోటిఫికేషన్స్ వాయిదా..

తెలంగాణలో పలు ఉద్యోగాల భర్తీకి నటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. దీనిలో టీఎస్పీఎస్సీ, తెలంగాణ మెడికల్ బోర్డుకు సంబంధించి నియామక సంస్థల నుంచి నోటిపికేషన్లు భారీగా విడుదలయ్యాయి.

తెలంగాణలో పలు ఉద్యోగాల భర్తీకి నటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. దీనిలో టీఎస్పీఎస్సీ, తెలంగాణ మెడికల్ బోర్డుకు సంబంధించి నియామక సంస్థల నుంచి నోటిపికేషన్లు భారీగా విడుదలయ్యాయి.

ఇప్పటికే దాదాపు 30కి పైగా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వెలువడిన నోటిఫికేషన్లలో ఎక్కువగా జనవరి నెల నుంచే అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. వీటిలో కొన్నింటికి దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. మరికొన్ని పోస్టులకు పరీక్షలు కూడా ముగిశాయి.

తాజాగా టీఎస్పీఎస్సీ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.   ఇటీవల డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించి 544 పోస్టులకు వెబ్ నోట్ విడుదలైంది. ఈ వెబ్ నోట్ డిసెంబర్ 31న టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కొరకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్లలోనే ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీ పోస్టులు కూడా ఉన్నాయి. పూర్తి నోటిఫికేషన్ జనవరి 31, 2023 నుంచి ప్రారంభం అవుతుందని.. ఇదే రోజు నుంచి దరఖాస్తులు సమర్పిణ ఉంటుందని టీఎస్పీఎస్సీ పేర్కొంది.

కానీ తాజాగా టీఎస్పీఎస్సీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అడ్మినిస్ట్రేషన్ కారణాల వల్ల వీటిని ఫిబ్రవరి 15 నుంచి ప్రారభిస్తామని పేర్కొంది.

15 రోజుల వరకు ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్లు వాయిదా వేసినా.. దరఖాస్తుల ప్రక్రియ మాత్రం.. టీఎస్ సెట్, యూజీసీ నెట్ ఫలితాల వరకు వెయిట్ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయాలి.

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్..
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ డిసెంబర్ లో విడుదలైంది. దీనికి దరఖాస్తుల ప్రక్రియ కూడా డిసెంబర్ 12 నుంచి ప్రారభం కాగా.. నేటి(జనవరి 31)తో దరఖాస్తుల ప్రక్రియ ముగియాల్సి ఉంది.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials