Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 10 January 2023

ఫరూక్ సియర్

ఫరూక్ సియర్ ని గద్దెనెక్కించిన సయ్యద్ సోదరులు అబ్దుల్లాఖాన్, హుస్సేన్ అలీఖాన్. ఫరూక్ సియర్ తండ్రి జహాందర్ షా సోదరుడైన అజీమ్ - ఉస్ - షాన్. ఫరూక్ సియర్ సయ్యద్ సోదరులకు వజీర్ (అబ్దుల్లాఖాన్); మీర్భక్షి (హుస్సేన్ ఆలీఖాన్) పదవులనిచ్చి గౌరవించాడు. సిక్కుల నాయకుడు బందా బహదూర్ గురుదాస్ పూర్ లో ఖైదు చేయబడి తర్వాత 19, 1716 న ఢిల్లీ లో చంపబడ్డాడు. ఫరూక్ సియర్ చే యామీనుదౌలా, కుతుబ్ - ఉల్ -ముల్క్, యార్ - ఇ - వఫాదార్, సిఫా-సాలార్, జాఫర్ జంగ్ అనే బిరుదులు పొందినది అబ్దుల్లాఖాన్. సయ్యద్ సోదరులు మొగలుల ఆస్థానంలో  హిందుస్తానీ గ్రూపుకు చెందినవారు. ఫ్రూక్సియారుచే 1717లో ఫర్మానాను పొందిన ఆంగ్ల రాయబారి జాన్సూర్మన్. ఫరూక్ సియర్ తండ్రి అయినా అజీమ్ ఉస్  షాన్ సయ్యద్ సోదరులను అలహాబాద్, బీహార్ ప్రాంతాలకు ఇన్చార్జ్ లుగా నియమించారు. మార్వార్ రాజు అజిత్ సింగ్ ను ఫరూక్ సియర్ తో సంధికి ఒప్పించినది హుస్సేన్ ఆలీ. ఫరూక్ సియర్ పాలనాకాలంలో బందా బైరాగి నేతృత్వంలో సిక్కులు గురుదాస్ పూర్ కోటను సంరక్షించే వారు. మొగలులు క్రీ.శ. 1715లో గురుదాస్ పూర్ కోటను సంరక్షించే వారు. మొగలులు క్రీ. శ. గురుదాస్ పూర్ కోటను స్వాధీనం చేసుకోవటంలో సఫలీ కృతులయ్యారు. చురమాన్ నేతృత్వంలోని జాట్లను ఆన్చడానికి రాజాజైసింగ్ సవాయ్ వినియోగించబడ్డారు. చురామన్ 1718లో మొగలులతో అంగీకారానికి వచ్చాడు. ఔరంగాబాద్ ప్రధాన కేంద్రంగా దక్కన్లోని 6 ప్రావిన్సులకు ప్రతినిధిగా ఫరూక్ సియర్ చిన్ కులీచ్ ఖాన్ ని నియమించాడు. చిన్ కులిచ్ ఖాన్ లేదా నిజం-టూల్ -ముల్క్ మొగలుల ఆస్థానంలో తురాని వర్గానికి చెందినవాడు. మరాఠాలకు వారి సైనిక సహాయానికి బదులుగా అనేక మినహాయిమ్పులను కల్పించి న ఢిల్ల్లీ ఒప్పందం (1719) హుస్సేన్ అలీ, పీష్వా బాలాజీ విషనాద్ ల మధ్య కుదిరింది. సయ్యద్ సోదరులు మారఠల సాయంతో ఫరూక్ సియర్ ను హత్య చేసారు. ఫరూక్ సియర్ అనంతరం మొగలు సింహాసనాన్ని అధిష్టి చి నది రఫీ -ఉద్ -దారాజత్.  రఫీ -ఉద్ -దారాజత్ అనంతరం రఫీ - ఉద్ దౌలా షాజహాన్-II  బిరుదుతో అధికారాన్ని చేపట్టాడు. షాజహాన్ II అనంతరం మహ్మద్ షా బిరుదుతో మొగలు సింహాసనాన్ని అదిష్టించినది రౌషన్ అక్తర్. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials