Mother Tongue

Read it Mother Tongue

Monday, 30 January 2023

TSPSC బోర్డు అత్యవసర భేటీ.. గ్రూప్ 4 దరఖాస్తుల గడువు పొడిగింపు..

TSPSC Group 4 Applications: ఎన్నడూ లేనంతగా ఈ సారి గ్రూప్ 4 కొలువులు అత్యధికంగా ఉండటంతో.. నిరుద్యోగుల నుంచి ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికే 8లక్షలకు చేరువలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణ(Telangana) ఏర్పడినప్పటి నుంచి ఇంత భారీ మొత్తంలో పోస్టులను విడుదల చేయలేదు. ఇలా  ఈ సారి గ్రూప్ 4 కొలువులు అత్యధికంగా ఉండటంతో.. నిరుద్యోగుల నుంచి ఎక్కువగా దరఖాస్తులు(Applications) వస్తున్నాయి. ఇప్పటికే 8లక్షలకు చేరువలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సర్టిఫికేట్ల అప్ లోడ్, సర్వర్(Server) సమస్యల కారణంగా చాలా మంది గ్రూప్ 4కు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలోనే జనవరి 30న ఉదయం టీఎస్పీఎస్సీ బోర్డు అత్యవసరంగా భేటీ అయినట్లు సమాచారం. గ్రూప్ 4 దరఖాస్తుల గుడువు పొడిగింపు కొరకు ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. దీనిని ఫిబ్రవరి(February) 03 వరకు పొడిగించారు. 

 ఇదిలా ఉండగా.. నేడు(జనవరి 30) గ్రూప్ 4 దరఖాస్తులకు చివరి తేదీకావడంతో.. ఉదయం నుంచి కూడా సర్వర్ బిజీ వస్తోంది. దీంతో చాలామంది దరఖాస్తులు చేసుకోలేకపోయారు. మరో వారం రోజులు ఈ దరఖాస్తుల గడువు పొడించాలంటూ నిరుద్యోగులు టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఫిబ్రవరి 03, 2023 వరకు దరఖాస్తుల గడువు పొడిగించారు.

గ్రూప్ 4 ఉద్యోగాలకు మరో 141 పోస్టులను కలుపుతూ టీఎస్పీఎస్సీ(TSPSC) ఇటీవల ప్రెస్ నోట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 8039 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో 141 పోస్టులను కలపడంతో ఈ పోస్టుల సంఖ్య 8180కి చేరాయి.   జనవరి 27న తెలంగాణ(Telangana) ఆర్థిక శాఖ 2,391 పోస్టులకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.   ఆర్థికశాఖ ఇప్పటికే 60,929 ఉద్యోగాలకు అనుమతి ఇవ్వగా.. ఇప్పుడు కొత్తగా అనుమతి ఇచ్చిన 2,391 ఉద్యోగాలను కలిపితే మొత్తం 63,320 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials