Mother Tongue

Read it Mother Tongue

Friday, 20 January 2023

రైల్వేలో 7914 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసై ఈ అర్హతలుంటే చాలు.. అప్లయ్‌ చేసుకోండి..!

Indian Railway Recruitment 2023 : భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే, నార్త్ వెస్ట్రన్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పలు పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే..

ప్రధానాంశాలు:

  • రైల్వే జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2023
  • 7914 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
  • కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ
Railway : రాత పరీక్ష లేకుండా.. 10వ తరగతి అర్హతతో 1785 రైల్వే ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
Indian Railway Recruitment 2023 : భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో.. 1785 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (RRC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిట్టర్‌, టర్నర్, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్, మెకానిక్‌, పెయింటర్‌, రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ మెకానిక్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానిక్‌ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials