స్థాపకుడు : వాసిష్టీపుత్ర /శ్రీశాంతమూలుడు
చిహ్నం : సింహం
రాజలాంఛనం : హారతీ పుత్రులు / శ్రీ పర్వతీయులుగా ప్రసిద్ధి
రాజధాని : విజయపురి
రాజభాష : ప్రాకృతం
మతం : వైష్ణవం, బౌద్ధమతం
శాసనాలు : నా గార్జున కొండ ,అమరావతి
శిల్పకళ : ఆకుపచ్చని రాతిపై శిల్పాలు, మందాత శిల్పం (జగ్గయ్యపేట)
గొప్పవాడు : వీరపురుష దత్తుడు
చివరివాడు : రుద్రపురుష దత్తుడు
ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు
1.శాసనాధారాలు :
మత్స్యపురాణం ప్రకారం ఏడుగురు ఇక్ష్వాకు రాజులు వంద సంవత్సరాలు పరిపాలించారు జగ్గయ్యపేట, నాగార్జునకొండ శాసనాల ప్రకారం నలుగురు ఇక్ష్వాకు రాజులు మాత్రమే పాలించారు. నాగార్జునకొండ శాసనం ప్రకారం వాశిష్టపుత్ర శాంతమూలుడు ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు. శాతవాహనులకు సామంతులుగా ఇక్ష్వాకులు ఉన్నారని వీరపురుషదత్తుని యొక్క అల్లూరి శాసనం పేర్కొంటుంది. ఇక్ష్వాకు వంశ చివరి రాజు రుద్రపురుషదత్తున్ని పల్లవ వంశస్థాపకుడు సింహవర్మ ఓడించాడు అని మంచికల్లు శాసనం పేర్కొంటుంది. ఇక్ష్వాకుల అంతం గురించి పేర్కొంటున్న శాసనాలు మైదవోలు శాసనం మరియు మంచికల్లు శాసనం.
2. పురాణాలు :
మత్స్యపురాణం ఏడుగురు ఇక్ష్వాకు రాజులు వంద సంవత్సరాలు పాలించారని పేర్కొంటుంది. ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులు అని, ఆంధ్రభృత్యులు అని మత్స్యపురాణం పేర్కొంది. ఇక్ష్వాకు రాకుమారులు దక్షిణ ప్రాంతానికి వచ్చి రాజ్యాలు స్థాపించారని విష్ణుపురాణం పేర్కొంటుంది.
3.సాహిత్య ఆధారాలు:
ధర్మామృతం (జైనకావ్యం, కన్నడ గ్రంథం). దీనిని న్యాయసేనుడు 11వ శతాబ్దంలో రచించాడు.
4. వంశం:
ఇక్ష్వాకులు తాము బుద్దుని (శాక్యముని) వంశానికి చెందిన వారమని నాగార్జునకొండ శాసనంలో ప్రకటించుకున్నారు. విష్ణుపురాణం, జైనధర్మామృతం ప్రకారం ఇక్ష్వాకు రాకుమారులు దక్షిణ ప్రాంతానికి వచ్చి రాజ్యాలు స్థాపించారు.
ఇక్ష్వాకు పాలకులు, వారి రాజకీయ చరిత్ర
1) వాశిష్టపుత్ర శ్రీశాంతమూలుడు:
శాతవాహన చివరి పాలకుడైన 3వ పులోమావిని పారద్రోలి ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను వ్యవసాయాభివృద్ధికి గోవులను, నాగళ్ళను, భూమిని దానం చేశాడు. ఇతను వైదిక మతం, పౌరాణిక మతాలను ఆదరించాడు. ఇతను కార్తికేయుని (మహాసేన విరుపాక్షకుని) భక్తుడు. ఈయన అశ్వమేథ, వాజపేయ యాగాలు నిర్వహించాడని ఇతని కుమారుడు వీరపురుషదత్తుని శాసనాల వలన తెలుస్తుంది. నాగార్జున కొండ వద్ద ‘అశ్వమేధ యాగ’ వేదిక బయటపడింది.
2) వీరపురుషదత్తుడు:
ఇతను శైవమతంను ద్వేషించినట్లు, శివలింగాన్ని కాళ్ళతో తొక్కుతున్నట్లు ఉన్న శిల్పాలు నాగార్జున కొండలో బయటపడ్డాయి. ఇతను బౌద్ధమును ఆదరించాడు. ఇతని కాలంను ఆంధ్రలో ” బౌద్ధ మత స్వర్ణయుగంగా ” పేర్కొంటారు. ఇతన్ని దక్షిణాది అశోకుడు అంటారు. ఇతని కాలంలో శ్రీపర్వతం (నాగార్జున కొండ) మహాయానంకు గొప్ప పుణ్య క్షేత్రమైంది. ఇతని కాలంలోనే శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
నోట్ : 1. భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం – శ్రీపర్వత విశ్వవిద్యాలయం.
2. భారత్ లో అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం – తక్షశిల.
మేనత్త కుమార్తెలను వివాహమాడే సాంప్రదాయం వీరి కాలంలోనే ప్రారంభమైంది.
3) శ్రీ ఎహుబల శాంతమూలుడు :
శాంతమూలుడి సోదరి కొండ, నాగార్జున కొండపై బౌద్ధవిహారాన్ని నిర్మించింది. ఇతని కాలం నుండే సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం ప్రారంభమైంది. నాగార్జునకొండ వద్ద సంస్కృత శాసనం వేయించాడు. (దక్షిణ భారత్ లో తొలి సంస్కృత శాసనం ) ఇతని కాలం నాటి ప్రాకృత శాసనం – గుమ్మడి గుర్రు శాసనం. దక్షిణ భారత్ లో హిందూ దేవాలయాలు నిర్మించిన మొట్టమొదటి రాజు. నాగార్జున కొండలో ఇతని కాలంలో నిర్మించిన దేవాలయాలు: 1. కార్తికేయుని ఆలయం. 2. నందికేశ్వర ఆలయం. 3. నవగ్రహ ఆలయం. 4. హరీతి దేవాలయం : హరీతి దేవాలయంలోని సప్తమాత్రుకల వద్ద ఆ కాలం నాటి స్త్రీలు సంతానం కోసం గాజులను సమర్పించేవారు.
ఇతని సేనాపతి ఎలిసిరి నాగార్జున కొండ వద్ద కుమారస్వామి దేవాలయం నిర్మించాడు. అభిరరాజు శక సేనుని సేనాని శివసేనుడు నాగార్జున కొండ వద్ద అష్టభుజ నారాయణస్వామి దేవాలయం నిర్మించాడు. ఇది ఆంధ్రదేశంలో నిర్మించిన తొలి వైష్ణవాలయం.
4) రుద్ర పురుషదత్తుడు:
ఇక్ష్వాకుల వంశంలో చివరివాడు. ఇతను పుష్పభద్ర స్వామి ఆలయంను నిర్మించాడు. మంచికల్లు శాసనం ప్రకారం పల్లవ వంశస్థాపకుడైన సింహవర్మచే ఇతను ఓడించబడ్డాడు. ఇక్ష్వాకుల అంతం గురించి పేర్కొన్న శాసనాలు- మైదవోలు శాసనం (శివస్కంధవర్మ), మంచుకల్లు శాసనం (సింహవర్మ).
No comments:
Post a Comment