Mother Tongue

Read it Mother Tongue

Saturday, 7 January 2023

టీ ఎస్ పీ ఎస్ సీ కీలక ప్రకటన .. మున్సిపల్ ఏ ఈ పరీక్ష వాయిదా

టీ ఎస్ పీ ఎస్ సీ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. మున్సిపల్ ఏ ఈ పోస్టులకు నిర్వహించే పరీక్షను వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12 వ తేదీన ఈ పరీక్షా జరగాల్సి ఉంది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అదే రోజున దేశవ్యాప్తంగా గేట్ (GATE 2023) పరీక్షా జరుగనుంది. ఏఈఈ పరీక్షా అదే  రోజున  నిర్హాహిస్తే గేట్ కు  ప్రిపేర్  అవుతున్న  ఇంజనీరింగ్   అభ్యర్థులు ఆ అవకాశాన్ని కోల్పోతారని టీ ఎస్ పీ ఎస్ సీ గుర్తించింది. అందుకే ఏఈఈ పరీక్షని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12 వ తారీఖున జరగవలసిన పరీక్షా మార్చి 5వ తారీఖునకు వాయిదా వేసింది.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials