స్థాపకుడు : విక్రమాదిత్య యుద్ధమల్లుడు
మతం : హైందవం, జైనం
రాజధాని : వేములవాడ
గొప్పవాడు : రెండవ అరికేసరి
చివరివాడు : మూడో అరికేసరి
వేములవాడ చాళుక్యులు చరిత్ర ఆధారాలు
సాహిత్య ఆధారాలు
పంపకవి రచించిన విక్రమార్జున విజయం , ఆది పురాణం, సోమదేవ సూరి రచించిన యశస్తిలక, మల్లియ రేచన రచించిన కవిజనాశ్రయం. ‘వేములవాడ’ (కరీంనగర్) ను రాజధానిగా చేసుకున్న తర్వాతనే వీరి ప్రత్యేక సంస్కృతి, రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనందున వీరిని వేములవాడ చాళుక్యులు అంటారు
వేములవాడ చాళుక్యులు పాలకులు, వారి రాజకీయ చరిత్ర
సత్యాశ్రయ రణ విక్రముడు : వేములవాడ చాళుక్య వంశంలో మొదటి వాడు బోధనన్ను రాజధానిగా చేసుకొని పాలించాడు. వీరు మొదట బాదామి చాళుక్యులకు, తర్వాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి పాలించారు. కొల్లిపర శాసనం (మొదటి అరికేసరి) ప్రకారం వేములవాడ చాళుక్య వంశ మూలపురుషుడు- సత్యాశ్రయరణ విక్రముడు.
వినయాదిత్య యుద్ధమల్లుడు : యుద్ధమల్లుడు నిజామాబాద్ జిల్లాలోని “నిందూరు బోధను” రాజధానిగా పాలన చేశాడు. ఇతను కొన్ని రాజ్యాలను, చిత్రకూట దుర్గాన్ని (కరీంనగర్ లోని రాయగిరి) సాధించినాడు.
మొదటి అరికేసరి : మొదటి అరికేసరి రాజధానిని బోధన్ నుండి “వేములవాడ” కు మార్చాడు.
బద్దెగుడు : బద్దెగ బద్దెగేశ్వరాలయాన్ని నిర్మించాడు. బద్దగేశ్వరాలయమును వేములవాడలోని భీమేశ్వరాలయంగా గుర్తించారు. ఇతని బిరుదు “సోలద-గండ” (అపజయమెరుగని వీరుడు)
రెండవ నరసింహుడు : పూరర ప్రతిహార మహీపాల చక్రవర్తిని ఓడించి “కాలప్రియ (కల్పి” అనే చోట విజయ సంభాన్ని నాటాడు. యమునా నదిని దాటి కన్యాకుబ్జ నగరం చేరి తన గుర్రాలకు గంగానది నీరు త్రాగించాడు. వేములవాడలో జైన చౌముఖాలు చెక్కించిన వేములవాడ చాళుక్యరాజు – రెండవ నరసింహుడు.
రెండో అరికేసరి : ఇతను వేములవాడ శిలాశాసనంను సంస్కృతంలో వేయించాడు. ఇతడు తన పేరుతో బోధన్లో అరికేసరి జీనాలయంను నిర్మించాడు. ఇతని కాలం నాటి కవులు : * పంపకవి * జీనవల్లభుడు * మల్లియరేచన
వాగరాజు : ఇతని ఆస్థాన కవి సోమదేవసూరి యశస్థిలక చంపూ కావ్యం ను వాగరాజు కాలంలోనే పూర్తిచేశాడు.
భద్రదేవుడు (రెండవ బద్దెగుడు) : కరీంనగర్ జిల్లాలోని ‘గంగాధర పట్టణం’ రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు. వేములవాడలో “సుభదామ జినాలయం” ను నిర్మించాడు.
No comments:
Post a Comment