స్థాపకుడు : ఇంద్రవర్మ (మహారాజేంద్రవర్మ)
రాజ చిహ్నం : పంజా ఎత్తిన సింహం
రాజలాంచనం : శ్రీ పర్వతస్వామి భక్తులుగా ప్రసిద్ధి
రాజధానులు : అమరపురం, ఇంద్రపాలనగరం, దెందులూరు
రాజభాష : సంస్కృతం
మతం : వైష్ణవం
ప్రత్యేకత : నరబలిని ప్రోత్సహించుట (మాధవవర్మ-2)
గొప్పవాడు : మాధవ వర్మ-2 (పరిపాలన స్వర్ణయుగంగా)
చివరివాడు : మంచన భట్టారకుడు
శిల్పకళ : ఉండవల్లి గుహలు
విష్ణుకుండినుల చరిత్ర ఆధారాలు
సాహిత్య ఆధారాలు : జనాశ్రయ చందోవిచ్చిత్తి, సేతుబంద అనే గ్రంథాలు
శాసన ఆధారాలు
1.తుమ్మల గూడెం రాగి శాసనాలు : వలిగొండ మండలం, నల్గొండ జిల్లా
2. చైతన్యపురి శిలా శాసనం : హైదరాబాదు జిల్లా
3. కీసర గుట్ట శిలా శాసనం : రంగారెడ్డి జిల్లా
4. సలేశ్వరం శిలా శాసనం : ఆమ్రాబాద్ మండలం, మహబూబ్ననగర్ జిల్లా
విష్ణు కుండినుల పాలకులు, వారి రాజకీయ చరిత్ర
1. ఇంద్ర వర్మ (మహరాజేంద్ర వర్మ) : విష్ణుకుండినుల వంశస్థాపకుడు ఇంద్రవర్మ అని మెజారిటీ చరిత్ర కారుల అభిప్రాయం. ఇతను ఇంద్రపురం అనే రాజధానిని నిర్మించాడు. ప్రస్తుతం దీనిని ఇంద్రపాలపురంగా పేర్కొంటున్నాయి.
2. మొదటి మాధవ వర్మ : ఇతను వాకాటకుల రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇతడు ఉండవల్లి, భైరవకొన, మొగల్ రాజపురం గుహలను చెక్కించాడు.
3. గోవింద వర్మ : విష్ణుకుండినుల తొలిరాజులలో అగ్రగణ్యుడు. ఇంద్రపాలపురం రాజధానిగా పరిపాలించాడు. ఇంద్రపాలపురంలో బౌద్ధభిక్షువులకు తన పట్టమహిషి మహాదేవి పేరుమీద మహావిహారం నిర్మించబడింది. ఈ విహారానికి గోవిందవర్మ పెన్కపుర,ఎన్మదల అనే గ్రామాలను దానంగా ఇచ్చాడు. తరువాతి కాలంలో వచ్చిన విక్రయేంద్ర భట్టాకరవర్మ (రెండవ విక్రయేంద్రవర్మ) ఈ విహారానికి ‘ఇరుందెర’ అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
4. రెండవ మాధవ వర్మ : విష్ణుకుండినుల రాజులలో సుప్రసిద్ధుడు. ఇతను సాధించిన ఒక్కొక్క విజయానికి గుర్తుగా కీసరగుట్ట పైన ఒక్కొక్క శివలింగంను ప్రతిష్టించాడు. ఇతను విజయం సాధించిన ప్రతిచోట రామలింగేశ్వరాలయాన్ని కట్టించాడు. వేల్పూరు శాసనం ప్రకారం ఇతను గణపతి (దంతముఖ స్వామి) ప్రతిష్ట చేసినట్లు తెలుస్తుంది. ఉండవల్లి గుహలలో పూర్ణకుంభంను చెక్కించాడు.
5. ఇంద్ర భట్టారక వర్మ (రెండవ ఇంద్రవర్మ) : ఇతను కీసర గుట్ట సమీపంలో ఘటికేశ్వర ఘటికాస్థానాన్ని (వైదిక కవి విద్యాలయాలు) స్థాపించాడు. ఉద్దంకుడు రాసిన సోమవేదంలో ఇంద్రభట్టారక వర్మ “ఘటికలు” అనే వైదిక విద్యాలయాలను స్థాపించినట్లు పేర్కొన్నాడు.
6. విక్రయేంద్ర భట్టారక వర్మ (రెండవ విక్రయేంద్ర వర్మ) : ఇంద్రపాలపురంలో గోవిందవర్మ భార్య మహదేవి నిర్మించిన విహారానికి ఇతను ఇరుందెర అను గ్రామంను దానం చేశాడు. బ్రాహ్మణులకు తుండి అను గ్రామంను దానం చేశాడు.
7. మంచన భట్టారక వర్మ : ఇతను విష్ణుకుండినులలో చివరి వాడు. మంచన భట్టారకున్ని పృథ్వీమూల మహారాజు ఓడించి రాజ్యాన్ని ఆక్రమించినట్లు “తాండివాడ” శాసనం ద్వారా తెలుస్తుంది.
No comments:
Post a Comment