విశాఖపట్నం, కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయాలు (క్లరికల్, టెక్నికల్) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23న శుక్రవారం ఉదయం 10 గంటలకు 768 పోస్టులకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లుజిల్లా ఎంప్లాయిమెంట్ విశాఖపట్నం జిల్లా అధికారి (క్లెరికల్), సి.హెచ్ సుబ్బి రెడ్డి తెలిపారు.
ఈ జాబ్ మేళా నందు ఈ క్రింద పేర్కొన్న సంస్థల నుండి జిల్లా ఉపాధి కార్యాలయానికి హెచ్ ఆర్ మేనేజర్లు స్వయంగా హాజరై అర్హులైన అభ్యర్ధులను వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ మొదలైన ప్రక్రియల ద్వారా ఎంపిక చేసి వారి కంపెనీలలో ఖాళీగా ఉన్న పోస్టులు నియమిస్తారు.
అమెజాన్ వేర్ హౌస్ తిరువళ్ళూర్ తమిళనాడు కంపెనీలో పికర్స్, పేకర్స్, స్టవ్వర్స్, సార్టర్స్, లోడింగ్, ఆన్ లోడింగ్ అసిస్టెంట్స్ మొత్తం 400 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు గాను 18 నుండి 30 సంవత్సరాలు వయసు ఉండాలి.
ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి వేతనం 18 వేల నుండి 20 వేల వరకు ఉంటుంది. ముత్తూట్ గ్రూప్ విశాఖపట్నం , ఇంటర్న్ ప్రొబేషనరీ ఆఫీసర్ 100 పోస్టులు ఖాళీ వున్నాయి. ఈ పోస్ట్ గాను 18 నుండి 26 వయసు ఉండాలి.
డిగ్రీ, ఎంబీఏ ఎం.కాం చదివిన పురుషులకు మాత్రమే ఈ ఉద్యోగాలున్నాయి. ఎంపికైనవారికి రూ.10 వేల నుంచి రూ.18,500 వరకు వేతనం ఇస్తారు. ఫ్లూయేంట్ గ్రిడ్ లిమిటెడ్ విశాఖపట్నం కంపనీ లో టెక్నీషియన్ పోస్టులు 100 వున్నాయి. ఈ పోస్టులకు గాను విద్యార్హత ITI ఎలక్ట్రికల్/ డిప్లొమా.. ఎలక్ట్రికల్ ఇలా ఇచ్చారు. 18 నుండి 26 ఏళ్ల వయసు మధ్య ఉండాలని అన్నారు. 15,000 జీతం ఇస్తారు.
ఆసక్తిగల యువతి , యువకులు https://employment.ap.gov.in/, www.ncs.gov.in వెబ్ సైటు నందు తమ పేర్లను నమోదు చేసుకొని తేది: 23.08.2024 న శుక్రవారం ఉదయం 10.00 గం. లకు జిల్లా ఉపాధి కార్యాలయము (క్లరికల్) నందు మెగా జాబ్ మేళాకు హాజరు కావాల్సినదిగా కోరడమైనది.
No comments:
Post a Comment