ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్-సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నవారు రక్షణ దళాల్లో చేరడానికి ఆసక్తి చూపుతుంటారు. మంచి కెరీర్‌తో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. దేశానికి సేవలందిస్తున్నామన్న సంతృప్తి కూడా ఉంటుంది. అయితే భారత రక్షణ దళాల్లో పని చేయాలనుకునే నిరుద్యోగులకు భారత వాయుసేన గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్-సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 182 సివిలియన్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indianairforce.nic.in విజిట్ చేసి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు సెప్టెంబర్ 3న ముగుస్తుంది.
* ఖాళీల వివరాలు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మొత్తంగా 182 సివిలియన్ పోస్టులను భర్తీ చేస్తుంది. అందులో లోయర్ డివిజన్ క్లర్క్- 157, టైపిస్ట్-18, డ్రైవర్-7 పోస్టులు భర్తీ కానున్నాయి.
* వయోపరిమితి
2024 సెప్టెంబర్ 1 నాటికి దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఇంటర్ పాసై ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ స్కిల్ తప్పనిసరి. నిమిషానికి కనీసం 30 ఇంగ్లిష్ పదాలను టైప్ చేసే సామర్థ్యం ఉండాలి. హిందీ టైపిస్ట్ ఉద్యోగానికి ఇంటర్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందీ టైపింగ్ స్కిల్ తప్పనిసరి. నిమిషానికి కనీసం 30 హిందీ పదాలను టైప్ చేయాలి. డ్రైవర్ పోస్టుకు అర్హత పదో తరగతి కాగా, వీరికి హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. రెండేళ్ల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.
* సెలక్షన్ ప్రాసెస్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సివిలియన్ రిక్రూట్‌మెంట్ సెలక్షన్ ప్రాసెస్‌లో ముందు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారు రెండో దశకు అర్హత సాధిస్తారు. వీరికి స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ లేదా ఫిజికల్ టెస్ట్ జరుగుతుంది. చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిక పోర్టల్ indianairforce.nic.in విజిట్ చేయాలి.
- హోమ్ పేజీలోకి వెళ్లి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సివిలియన్ రిక్రూట్‌మెంట్-2024 అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
- ఆ తరువాత అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్‌లో అడిగిన అన్ని వివరాలను నింపాలి. ఫారమ్‌కు అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
- అప్లియేషన్‌ను ఎంపిక చేసుకున్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్/యూనిట్‌కు పోస్ట్‌లో పంపాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ జారీ అయిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేరాల్సి ఉంటుంది.
* జీతభత్యాలు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సివిలియన్ రిక్రూట్‌మెంట్‌కు ఎంపికయ్యే అభ్యర్థుల పే స్కేల్… లెవల్-2 , 7వ పే మ్యాట్రిక్స్ సీపీసీ ప్రకారం ఉంటుంది.
No comments:
Post a Comment