ఈ రోజుల్లో ఉద్యోగం చేయాలంటే భారీ జీతం చూస్తున్నారు జనం. తమ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా సరైన జాబ్ వెతుక్కుంటున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ప్రైవేట్ ఉద్యోగాల్లో చూస్తే సాఫ్ట్‌వేర్ కొలువులదే పైచేయి అని చెప్పుకోవాలి. పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు భారీ జీతం ఇచ్చి రిక్రూట్‌మెంట్స్ చేస్తున్నాయి. దీంతో ఇలాంటి ఉద్యోగాల కోసం జనం పోటీపడుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే విప్రో కంపెనీ ఎల్1 టెక్ సపోర్ట్ ఇంజినీర్ (Support Engineer) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
డిగ్రీ అర్హతతో ఈ ఎల్1 టెక్ సపోర్ట్ ఇంజినీర్ కొలువుల భర్తీ చేయనున్నట్లు విప్రో కంపెనీ తెలిపింది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. పలు దశల్లో ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. అయితే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు లొకేషన్‌లో పని చేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారికి కొన్ని టెక్నీకల్ స్కిల్స్ అవసరం. ఎంఎస్ ఎక్సెల్ , న్యూట్రల్ వాయిస్ అండ్ యాక్సెంట్, మల్టీ టాస్క్, కాల్ మేనేజ్‌మెంట్, ప్రాసెస్ నాలెడ్జ్, అనలిటికల్ స్కిల్స్ స్కిల్స్ ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment