ఇటీవల వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. వీటిలో ఈ వారం అప్లై చేయాల్సినవి ఏవో చూద్దాం.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? మంచి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. ఇటీవల వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. వీటిలో ఈ వారం అప్లై చేయాల్సినవి ఏవో చూద్దాం.
* ఇస్రో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), కేరళలోని తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) కింద వివిధ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. వెల్డర్, ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్, టర్నర్, మెషినిస్ట్, హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఎ’, కుక్, లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ మెకానిక్ వంటి 30 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ isro.gov.in ద్వారా ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జీతం రూ. 1,42,000 వరకు ఉంటుంది. పోస్టు ఆధారంగా విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* ONGC రిక్రూట్‌మెంట్
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఇటీవల కొత్త జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంటర్‌ప్రెటేషన్ జియాలజిస్ట్ విత్ ఆపరేషన్ జియాలజిస్ట్, ఇంటర్‌ప్రెటేషన్ జియోఫిజిక్స్ అనే రెండు స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 4 వరకు ONGC అధికారిక వెబ్‌సైట్ ongcindia.com లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఇమెయిల్‌లో ఇంటర్వ్యూ షెడ్యూల్ వివరాలను పంపిస్తారు.
ఇంటర్‌ప్రెటేషన్ జియాలజిస్ట్ విత్ ఆపరేషన్ జియాలజిస్ట్ ఉద్యోగాలకు.. జియాలజీలో M.Sc, M.Sc (టెక్), లేదా M.Tech అర్హతతో పాటు ఇంటర్‌ప్రెటేషన్ ఆపరేషన్ జియాలజీలో 20 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్ అవసరం. రెండో పోస్టుకు జియోఫిజిక్స్ లేదా అప్లైడ్ జియోఫిజిక్స్‌లో M.Sc టెక్ లేదా M.Tech చదివి ఉండాలి, అలాగే APIలో 20 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్ అవసరం. ఎంపికైన వారికి జీతం రూ. 1,20,000 నుండి రూ. 1,27,500 వరకు ఉంటుంది.
* ESIC రిక్రూట్‌మెంట్ 2024
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), వివిధ విభాగాల్లో 18 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ esic.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు చివరి రోజు సెప్టెంబర్ 7. అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ వంటి వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉన్న వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సెలక్ట్ అయిన వారికి నెలకు రూ. 67,700 జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.
* BMC క్లర్క్ రిక్రూట్‌మెంట్
బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) వివిధ విభాగాలలో క్లర్క్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. అర్హత ఉన్నవారు BMC అధికారిక వెబ్‌సైట్ atportal.mcgm.gov.inని విజిట్ చేసి అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. ఇందుకు సెప్టెంబర్ 8 వరకు అవకాశం ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో గ్రూప్ C- క్లరికల్ గ్రేడ్‌లో 1,846 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెల జీతం రూ. 25,500- రూ.81,100 వరకు ఉంటుంది. టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
* GPSC రిక్రూట్‌మెంట్
గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (GPSC), ప్రస్తుతం 300 టాక్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. అప్లికేషన్ గడువు ఆగస్టు 31న ముగుస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ ద్వారా ఎంపిక చేస్తారు.
No comments:
Post a Comment