Govt Jobs: ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI), తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనుంది.
నిరుద్యోగులకు మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI), తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 21 లోపు IWAI అధికారిక వెబ్‌సైట్ www.cdn.digialm.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.
* పోస్టుల వారీగా ఖాళీలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో IWAI మొత్తం 37 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 11 ఖాళీలు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 5, డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్- 5, టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్/మెకానికల్/ఇంజనీరింగ్/ నావల్ ఆర్కిటెక్చర్)- 5 పోస్టులు, మాస్టర్ సెకండ్ క్లాస్- 3, అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్)- 2, అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (AHS)- ఒక పోస్టు, లైసెన్స్ పొందిన ఇంజిన్ డ్రైవర్- ఒక పోస్టు, స్టోర్ కీపర్- ఒక పోస్టు, మాస్టర్ థర్డ్ క్లాస్- ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి.
* ఎవరెవరు అర్హులు?
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లైసెన్సుడ్ ఇంజిన్ డ్రైవర్, డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్, స్టోర్ కీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్)కు దరఖాస్తు చేసే అభ్యర్థులు సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చదివి ఉండాలి. అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (AHS) ఉద్యోగాలకు సివిల్ విభాగంలో బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు తప్పనిసరిగా కామర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* వయో పరిమితి
అభ్యర్థుల వయస్సు 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
* జీత భత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు జీతం, పోస్టును బట్టి రూ. 18,000 నుండి రూ. 1.77 లక్షల వరకు ఉంటుంది. పీఎఫ్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.iwai.nic.in ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ‘అప్లై ఆన్‌లైన్’ సెలక్ట్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇతర వివరాలు నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
- అనంతరం అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్‌మిట్ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు అప్లికేషన్ నంబర్ వస్తుంది.
* సెలక్షన్ ప్రాసెస్
పోస్టును బట్టి సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అయితే, కొన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. మరికొన్ని నిర్దిష్టమైన పోస్టులకు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు వారి అర్హత ప్రమాణాలకు అనుగుణంగా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
No comments:
Post a Comment